సాగుకు అవసరమైన యూరియా ఉంది
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:29 PM
జిల్లాలో పంటల సాగుకు అవసరమైన యూరియా అందు బాటులో ఉందని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని సుద్దాల గ్రామంలోని ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
చెన్నూరు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పంటల సాగుకు అవసరమైన యూరియా అందు బాటులో ఉందని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని సుద్దాల గ్రామంలోని ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. యూరియా నిల్వలు, రిజిష్టర్‌లను తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా అందించాలని ఏవోకు సూచించారు. కలెక్టర్ మాట్లాడు తూ జిల్లాలోని రైతులందరికి పంటల సాగుకు అవసరమైన యూరియా అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా చర్యలు చేపడుతున్నారు. రైతులు అవసరమైన మేరకే బస్తాలు తీసుకుని సాగు కు వినియోగించుకోవాలన్నారు. ముందస్తు సాగుకు తీసుకోవద్దన్నారు. యూరియా పక్కదారి పట్టకుం డా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పంటలు సాగు చేస్తున్న రైతులకు సమయాను సా రంగా యూరియాను అందిస్తామని, రైతులందరూ సహకరించాలని తెలిపారు. ఆయన వెంట ఏవో యామిని, ఎంపీడీవో మోహన్ ఉన్నారు.