కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదు
ABN , Publish Date - Jul 03 , 2025 | 12:39 AM
బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే కూసుకుం ట్ల ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు.
కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదు
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
చండూరు, జూలై 2(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే కూసుకుం ట్ల ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. చండూరులో పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. తమ పార్టీకి చెందిన మునిసిపల్ మాజీ చైర్మన తోకల చంద్రకళవెంకన్నకు చెందిన భవనాన్ని సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడం ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పతనానికి నాంది అన్నారు. బీఆర్‌ఎస్ ప్ర భుత్వ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి మంత్రి జగదీ్‌షరెడ్డి, కేటీఆర్ సహకారంతో చండూరు మునిసిపాలిటీ అభివృద్ధికి రూ.50కోట్లు నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఉన్న నిధులను సద్వినియోగం చేసుకోకుండా ఎమ్మె ల్యే రాజగోపాల్‌రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పరిపాలనను పక్కకుబెట్టి తుగ్లక్ అరాచకాలకు తెరలేపుతున్నాడని విమర్శించారు. రోడ్డు వెడల్పు పనులకు డీపీఆర్ లేకుండా ఒక దగ్గర 95 ఫీట్లు, మరో దగ్గర 90ఫీట్లు, వారి పార్టీ అనుచరుల గణానికి, ముడుపులు ముట్టిన చోట 85 ఫీట్లు అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వ్యవహరిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని దు య్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా తాము మంజూరు చేసిన నిధులే తప్ప, ఏ ఒక్క రూపాయి కూడా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించలేదని అన్నారు. రాజగోపాల్‌రెడ్డి గెలిచిన నాటి నుంచి నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. చండూరు మండల కేంద్రంలో చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. కేసీఆర్ నాయకత్వంలో తాము ఎన్నో పోరాటాలు చేశామని, తెలంగాణ తె చ్చిన తాము ఇలాంటి దగాకోరు, దగుల్బాజీలకు భయపడేది లేదన్నారు. తమ పా ర్టీ కార్యకర్తల కోసం ఎంతటి త్యాగానికైనా, పోరాటానికైనా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొ న్నారు. ఎప్పటికప్పుడు మీ అరాచకాలను, అకృత్యాలను ఎండగడుతూ ప్రజలకు వివరిస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న, కొత్తపాలి సతీష్, చండూరు, చౌటుప్పల్ మాజీ జడ్పీటీసీలు కర్నాటి వెంకటేశం, పెద్దిటి బుచ్చిరెడ్డి, మునిసిపల్ మాజీ చైర్మన తోకల చం ద్రకళవెంకన్న, కౌన్సిలర్లు కోడి వెంకన్న, గుంటి వెంకటేశం, పెదగోని వెంకన్న, కురుపాటి సుదర్శన, తేలుకుంట్ల చంద్రశేఖర్, తేలుకుంట్ల జానయ్య పాల్గొన్నారు.