పింఛన్లు పెంచకపోతే సహించేది లేదు
ABN , Publish Date - Aug 21 , 2025 | 10:49 PM
దివ్యాంగులకు అందించే పింఛన్లు పెంచుతూ ప్రభుత్వ ప్రకటన చేయకుంటే సహించేది లేదని ఎమ్మార్సీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద క్రిష్ణ మాదిగ అన్నారు. మహాగర్జన సభ ని యోజకవర్గ స్థాయి సన్నాహక సదస్సును గురువారం బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగ
బెల్లంపల్లి, ఆగస్టు21 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగులకు అందించే పింఛన్లు పెంచుతూ ప్రభుత్వ ప్రకటన చేయకుంటే సహించేది లేదని ఎమ్మార్సీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద క్రిష్ణ మాదిగ అన్నారు. మహాగర్జన సభ ని యోజకవర్గ స్థాయి సన్నాహక సదస్సును గురువారం బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లు పెంచు తామని హామీ ఇచ్చినప్పటికీ నెరవేర్చకపోవడంతో రాష్ట్రంలో 50లక్షల మం దికి పైకి పింఛన్‌దారులు ఎదురు చూస్తున్నారన్నారు. పింఛన్లు పెంచకపో తే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతామన్నారు. ప్రభుత్వం ఏ ర్పడి 20 నెలలు గడుస్తున్నా పింఛన్లు పెంచకుండా కొత్తవి ఇవ్వకుండా ది వ్యాంగులను, వృద్ధులను మోసం చేస్తోందన్నారు. సెప్టెంబర్‌లో జరిగే మ హా గర్జన సన్నహాక సదస్సుకు వేలాది మంది తరలి రావాలని సూచించా రు. అనంతరం మందక్రిష్ణ మాదిగను పలువురు సన్మానించారు. ఈ కార్య క్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నియోజకవర్గ నాయకులు ఎలిగేటి తిరుపతి, నాయకులు మధూకర్, నరేష్, వృద్ధులు, వికలాంగులు పాల్గొన్నారు.