Share News

ఆట వస్తువులకు భలే గిరాకీ

ABN , Publish Date - May 08 , 2025 | 11:53 PM

సెలవుల్లో చిన్నారులు ఆటపాటలతో గడపాలని కోరుకుంటున్నారు. ట్యూషన్లు, హోంవర్క్‌లతో కష్టపడి చదువుకున్న చిన్నారులకు వేసవి సెలవులు ఎంతో ఆనందాన్ని తెచ్చి పెట్టాయి.

 ఆట వస్తువులకు భలే గిరాకీ
క్యారం బోర్డు ఆడుతున్న చిన్నారులు

ఆట వస్తువులకు భలే గిరాకీ

ఇండోర్‌ గేమ్స్‌కు పెరుగుతున్న ఆదరణ

వేసవి సెలవుల్లో చిన్నారుల ఆహ్లాదం

పెరుగుతున్న క్రీడా సామగ్రి కొనుగోళ్లు

నల్లగొండ, స్పోర్ట్స్‌ మే 8 (ఆంధ్రజ్యోతి): సెలవుల్లో చిన్నారులు ఆటపాటలతో గడపాలని కోరుకుంటున్నారు. ట్యూషన్లు, హోంవర్క్‌లతో కష్టపడి చదువుకున్న చిన్నారులకు వేసవి సెలవులు ఎంతో ఆనందాన్ని తెచ్చి పెట్టాయి. రోజంతా ఆటలతో కాలం గడుపుతున్నారు. దాంతో ఆట వస్తువులకు భలే గిరాకీ ఉంది. ఉష్ణోగ్రత తీవ్రత రోజుకు ఎక్కువగా ఉన్నందున ఇండోర్‌ గేమ్స్‌పై చిన్నారులు మక్కువచూపుతున్నారు. ఇండోర్‌ గేమ్స్‌, క్యారం, చెస్‌, బిల్లింగ్‌ రాక్స్‌, ట్రైన సెట్లతో పాటు స్విమ్మింగ్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో సిమ్మింగ్‌ డ్రస్‌లకు కూడా గిరాకీ ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ప్రతీ ఒక్కరూ ఇష్టపడే క్రికెట్‌, ఫుట్‌బాల్‌ను కూడా ఆడుతున్నారు.

వీడియో గేమ్స్‌

చిన్నారులు ఎక్కువగా వీడియో గేమ్సను ఇష్టపడుతున్నారు. దాంతో ఇండోర్‌ గేమ్స్‌లలో ఎక్కువ ఆట వస్తువులు వీడియో గేమ్స్‌ అమ్ముడుపోతున్నాయి. వీటి ధర రూ. 40 నుంచి 600 రూపాయల వరకు ఉంది.

క్రికెట్‌

ఈ ఆటను చిన్నారులతో, పాటు పెద్దలు కూడా ఇష్టపడుతున్నారు. వేసవిలో ఎండ వేడిమి ఎంత ఉన్న క్రికెట్‌కు సంబంధించిన బ్యాట్‌, బాల్స్‌ కొనుగోలు చేస్తున్నారు. పెద్దవారికి, చిన్నవారికి సంబంధించిన క్రికెట్‌ బ్యాట్‌ బాల్స్‌ రూ. 200 వరకు కొనుగోలు చేస్తున్నారు.

స్విమ్మింగ్‌ డ్రెస్‌

నల్లగొండ పట్టణ నడిబొడ్డులో ఇటీవల ప్రారంభమైన స్విమ్మింగ్‌ పూల్‌లో చిన్నారులు ఎంతో ఆహ్లాదకరంగా స్విమ్మింగ్‌ చేస్తున్నారు. దీం తో స్విమ్మింగ్‌ డ్రెస్‌లకు గిరాకీ పెరిగింది. రూ. 300 నుంచి 350 వరకు స్విమ్మింగ్‌ డ్రెస్‌, రూ. 60 క్యాపు, కళ్లద్దాలు రూ. 50 విక్రయిస్తున్నారు.

క్యారం, చెస్‌

ఇండోర్‌ గేమ్స్‌లో ఎక్కువ మంది నేర్చుకోవాలని కుతూహల పడేది క్యారమ్స్‌, చెస్‌. క్యారంబోర్డులు రూ. 200 నుంచి రూ. 400 ధరకు ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు.

బిల్డింగ్‌ రాక్స్‌, ట్రైన సెట్‌

ఎల్‌కేజీ, యూకేజీ స్థాయి విద్యార్థులకు ఇంట్లో ఉండి ఆటలాడుకోవడానికి తల్లిదండ్రులు ఇష్టపడతారు. బిల్డింగ్‌ రాక్స్‌, ట్రైన సెట్‌, రిమోట్‌ కా ర్లను కొనుగోలు చేస్తున్నారు. వీటి ధ ర రూ. 150 నుంచి 500 వరకు బిల్డిం గ్‌ రాక్స్‌, ట్రైన సెట్‌ రూ. 400 నుంచి 450, రిమోట్‌ కార్లు రూ. 100 నుంచి రూ.500 వరకు లభ్యమవుతున్నాయి.

క్రికెట్‌ అంటే చాలా ఇష్టం

క్రికెట్‌ ఆట అంటే నాకు చాలా ఇష్టం. సెలవులు బా గా ఆడుకుంటున్నాను. టైం పాస్‌ కోసం రిమోట్‌ కారును కొనుగోలు చేశా.

యశ్వంత, 4వ తరగతి, నల్లగొండ

వీడియో గేమ్స్‌ ఆడుతున్నా

వేసవి సెలవులు వీడియో గేమ్స్‌ ఆడుకుంటున్నాను. వీడి యో గేమ్స్‌ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతీరోజు నేను వీడి యో గేమ్స్‌ ఆడుకుంటున్నాను.

కార్తీక్‌, నల్లగొండ

సెలవుల్లో గిరాకీ పెరిగింది

వేసవిలో ఆట వస్తువులకు గిరాకి పెరిగింది. ఎక్కువమంది స్విమ్మింగ్‌ పూల్‌ డ్రస్సులు వీడియో గేమ్స్‌ ను ఎక్కువగా విక్రయిస్తున్నారని హనుమాన స్పోర్ట్స్‌ యజమాని సత్తయ్య గౌడ్‌ పేర్కొన్నారు.

- సత్తయ్యగౌడ్‌, హనుమాన స్పోర్ట్స్‌ షాప్‌ యజమాని

Updated Date - May 08 , 2025 | 11:53 PM