ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో సదుపాయాలు లేవని
ABN , Publish Date - Dec 01 , 2025 | 11:33 PM
పాత బస్టాండ్ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనంలో కనీస మౌలిక వసతులు లేవంటూ సోమవారం పట్టణ కూరగాయల, చిరు వ్యాపారులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు.
మున్సిపల్ కార్యాలయం ముట్టడి
చెన్నూరు, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : పాత బస్టాండ్ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనంలో కనీస మౌలిక వసతులు లేవంటూ సోమవారం పట్టణ కూరగాయల, చిరు వ్యాపారులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఈ సంద ర్భం గా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ భవ న సముదాయంలో వసతులు లేవని వాపోయారు. 30 ఏళ్లుగా పట్టణం లోని జగన్నాథస్వామి ఆలయం, గాంధీ చౌక్, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లోని రహదారులపై వ్యాపారం చేస్తూ పూట గడుపుతున్నామన్నారు. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించి ఎలాంటి వసతులు లేని సమీకృత మార్కెట్ భవనంలో కూరగాయల వ్యాపారం చేయాలని తమపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. కమిషనర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ముం దు ముందు జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉం టుందన్నారు. సమీకృత భవనంలో మహిళలకు కనీస వసతులు లేవని, అక్కడే వ్యాపారం చేయాలని పేర్కొనడం ఎంత వరకు సమంజసమని ప్ర శ్నించారు. మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం సమీకృత భవనంలో అన్ని సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మున్సిపల్ కార్యాల యం ముందు ఆందోళన చేస్తున్న వ్యాపారులకు పోలీసులు నచ్చజెప్పి అక్కడ నుంచి పంపించివేశారు.