kumaram bheem asifabad- జిల్లాలో 3,53,904 మంది ఓటర్లు
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:19 PM
జిల్లాలోని 15 మండలాల్లో 3,53,904 మంది ఓటర్లు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు అడుగులు పడుతున్న వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్ ఆధ్వర్యంలో గురువారం మండలాల వారీగా ఓటరు జాబితా విడుదల చేశారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 15 మండలాల్లో 3,53,904 మంది ఓటర్లు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు అడుగులు పడుతున్న వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్ ఆధ్వర్యంలో గురువారం మండలాల వారీగా ఓటరు జాబితా విడుదల చేశారు. జిల్లాలోని 15 మండలాల్లో 3,53,904 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,76,610 మంది, మహిళలు 1,77,274 మంది మహిళలు ఉన్నారు. ఆసిఫాబాద్‌లో 30,324 మంది, బెజ్జూరులో 23,734 మంది, చింతలమానేపల్లిలో 23,955 మంది ఓటర్లు ఉన్నారు. దహెగాంలో 22,092 మంది, జైనూరులో 24,363 మంది, కాగజ్‌నగర్‌లో 45,242 మంది, కెరమెరిలో 24,026 మంది, కౌటాలలో 27,357 మంది ఉన్నారు. లింగాపూర్‌లో 10,583 మంది, పెంచికల్‌పేటలో 12,302 మంది, రెబ్బెనలో 28,724 మంది, సిర్పూర్(టి)లో 22,182 మంది, తిర్యాణిలో 18,148 మంది, వాంకిడిలో 28,595 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.
ఓటరు జాబితా ప్రదర్శన
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలకు రెండో విడత సాధారణ ఎన్నికలు నిర్వహించేందుకు మండల పరిధిలోని 27 గ్రామ పంచాయతీల వార్డుల వారీగా గురువా రం ఓటర్లు ముసాయిదా జాబితాను జిల్లా పరిషత్ కార్యాలయంలో నోటీసు బోర్డుపై ప్రచురించినట్లు ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. సదరు ఓటరు జాబితాలపై ఏమైనా సూచనలు, అక్షేపణలు, అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా ఈ నెల 30లోగా దరఖాస్తు సమర్పించాలన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయ ూల్లో గురువారం ఆయా గ్రామాల కార్యదర్శులు ఓటరు జాబితా నమూనాను ప్రద ర్శించారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్లలో జాబితాను ప్రదర్శించామని, అభ్యంతరాలు ఉన్నట్లయితే లిఖిత పూర్వకంగా గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేయవచ్చని కార్యదర్శులు సూచించారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): దహెగాం మండల వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో గురువారం కార్యదర్శులు ఓటరు జాబితాను ప్రదర్శించారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలలో ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే రాత పూర్వకంగా ఫిర్యాదులు చేయవచ్చని కార్యదర్శులు పేర్కొన్నారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): కెరమెరి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కేంద్రాల్లో ముసాయిదా ఓటరు జాబితాను గురువారం కార్యదర్శులు ప్రచురించినట్లు ఎంపీడీవో అంజద్‌పాషా తెలిపారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30లోగా ఎంపీడీవో కార్యాలయంలో తెలపాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్‌పీవో ఉమ్‌షరీఫ్, కార్యదర్శులు ఉన్నారు.
సిర్పూర్(టి), (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితాపై ఏమైన అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో సత్యనారాయణ అన్నారు. అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటరు జాబితాను గురువారం ప్రచురించారు.