వారి త్యాగాలు చిరస్మరణీయం
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:20 PM
విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.
- పోలీసు అమరుల దినోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అచ్చంపేటటౌన్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. పోలీస్ అమర వీరుల దినోత్సవం సందర్భంగా గురువారం పట్ట ణంలోని పోలీస్ స్టేషన్‌లో పోలీస్‌శాఖ, లయన్స్ క్లబ్ ఆధ్వర్వంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చే శారు. డివిజన్ పరిధిలోని అన్ని మండలాల పోలీస్ స్టేషన్‌ల ఎస్‌ఐలు శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రక్తదాన శిబిరాన్ని పరిశీ లించారు. ఆయనకు డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ నాగరాజు పూలమొ క్కతో స్వాగతం పలికారు. అనంతరం రక్తదా నంలో పాల్గొన్న వారికి సర్టిఫి కెట్లు అందజేసి అభినందించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం అనే ది మరో వ్యక్తికి ప్రాణదానమ న్నారు. ప్రతీ మనిషి రక్తదా నం చేయాలన్నారు. ఎస్‌ఐలు విజయ్ భాస్కర్, ఇందిరమ్మ పాల్గొన్నారు.
అమ్రాబాద్‌లో రక్తదానం
అమ్రాబాద్, (ఆంధ్రజ్యోతి) : పోలీస్ అమరుల దినోత్సవాన్ని పురస్కరించుకు ని పోలీస్‌శాఖ, అచ్చంపేట లయన్స్‌క్లబ్ ఆధ్వ ర్యంలో గురువారం మండల కేంద్రంలో రక్తదాన శిబిరంనిర్వహించారు. పోలీస్ సిబ్బందితో పాటు వివిధ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు 43 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో అమ్రాబాద్ సీఐ శంకర్‌నాయక్, అమ్రాబాద్, పదర, కృష్ణగిరి ఎస్‌ఐలు గిరిమనో హర్‌రెడ్డి, సద్దాంహుస్సేన్, జయన్న, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.