Share News

kumaram bheem asifabad- నేతల రాతలు మారనున్నాయ్‌

ABN , Publish Date - Oct 03 , 2025 | 10:27 PM

స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కావడంతో జిల్లాలోని పలువురు నేతల తలరాతలు మారనున్నాయి. ఈ సారి ఎన్నికల బరిలో నిలిచే అవకాశమే లేకపోవడంతో నేతలంతా దూరందూరంగానే ఉంటున్నారు. గతంలో జడ్పిటీసీ, ఎంపిటీసీ, ఎంపీపీలుగా పని చేసిన నేతలంతా నిరాశతో కనిపి స్తున్నారు. మరి కొందరు నేతలు మండల స్థాయిలో ఉన్న పదవులకు మహిళల రిజర్వేషన్లు ఉన్న చోట వాళ్ల భార్యలను బరిలోకి దింపేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

kumaram bheem asifabad- నేతల రాతలు మారనున్నాయ్‌
లోగో

- మహిళ రిజర్వేషన్‌ వచ్చిన చోట భార్యలను బరిలో నిలిపే యత్నం

- బీసీ రిజర్వేషన్ల పెంపుతో అంచనాలు తారుమారు

చింతలమానేపల్లి, అక్టోబరు 3 (ఆంఽధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కావడంతో జిల్లాలోని పలువురు నేతల తలరాతలు మారనున్నాయి. ఈ సారి ఎన్నికల బరిలో నిలిచే అవకాశమే లేకపోవడంతో నేతలంతా దూరందూరంగానే ఉంటున్నారు. గతంలో జడ్పిటీసీ, ఎంపిటీసీ, ఎంపీపీలుగా పని చేసిన నేతలంతా నిరాశతో కనిపి స్తున్నారు. మరి కొందరు నేతలు మండల స్థాయిలో ఉన్న పదవులకు మహిళల రిజర్వేషన్లు ఉన్న చోట వాళ్ల భార్యలను బరిలోకి దింపేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. జిల్లాలో స్థానిక ఎన్నికల కోసం ఎదురుచూసిన అనేక మంది నేతల పరిస్థితి రిజర్వేషన్లతో తారుమారయ్యింది. పోటీ చేసేందుకు అవకాశమే లేకుండా పోయింది. దీంతో రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్‌ కల్పించడంతో జనరల్‌ స్థానాలు కరువయ్యాయి. దీంతో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ నాయకత్వానికి ఎక్కువగా ప్రాధాన్యత దక్కుతోంది.

- గత ఎన్నికల్లో ఎస్టీ రిజర్వుడ్‌గా..

గత ఎన్నికల్లో జిల్లాలో ఎస్టీ రిజర్వుడ్‌గా ఉన్న జడ్పీ పీఠం చైర్మన్‌ పదవి ఈ సారి బీసీ జనరల్‌కు దక్కడంతో చాలా మంది నేతలు పోటీ చేసేందుకు ఆసక్తి చూపినా జట్పీటీసీ స్థానాలు అనుకున్న స్థానాలు రిజర్వేషన్‌ దక్కకపోవడంతో ఆశలు ఆవిరవుతున్నాయి. గత ఎన్నికల్లో రెండు మాత్రమే బీసీలకు ఎంపీపీ స్థానాలు కేటాయించగా తాజాగా ఈ సారి 5 స్థానాలకు చేరింది. జడ్పిటీసీ స్థానాలు మూడు ఉండగా ఈ సారి ఆుకు చేరింది. ముఖ్యంగా జడ్పి పీఠంపై ఆశలు పెట్టుకున్న బడా నేతలకు రిజర్వేషన్లు అనుకూలిం చకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్న చర్చ రాజీకయ వర్గాల్లో జోందుకున్నది. కానీ కొంత మంది బీసీ నాయకులకు సొంత మండలంలో బీసీ రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో వారు ఈ రిజర్వేషన్‌ ఉన్న మండలాల్లో పదవీ సాధించేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు రాజకీయ నిపుణుల్లో చర్చ జరుగుతోంది. అయితే జిల్లాలోని కౌటాల, కాగజ్‌నగర్‌, కెరమెరి మండలాల్లో బీసీ జనరల్‌, రెబ్బెన, తిర్యాణి మండలాల్లో బీసీ మహిళ, లింగాపూర్‌లో జనరల్‌ మహిళ, సిర్పూర్‌(యూ)లో జనరల్‌ జడ్పిటీసీ స్థానాలు ఖరారు కాగా ఈ స్థానాల్లో గెలుపొందిన వారికే జడ్పి పీఠం దక్కనుంది. దీంతో ఈ మండలాల్లో కొందరు నాయకులు నాయకులు దృష్టి సారించారు.

- చట్టబద్ధత లేకపోవడంతో..

బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత లేకుండా పోయిది. దీంతో రిజర్వేషన్లు ఖరారు అయినా సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే కొంత మంది కోర్టునే ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన హైకోర్టు అక్టోబరు 8వ తేదీకి వాయిదా వేసింది. దీంతో అందరి దృష్టి అక్టోబరు 8 పైనే పడింది. హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ కన్పిస్తోంది. ఒక వేళ బీసీ రిజర్వేషన్లు చెల్లవని తీర్పు వస్తే ..పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే అవకాశం కన్పిస్తున్నది. అలాగే 42 శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తే బీసీ రిజర్వేషన్లు తారుమారయ్యే అవకాశం లేకపోలేదు. దీంతో జనరల్‌ స్థానాలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వే షన్లు యథావిధిగానే ఉన్నా బీసీ రిజర్వేషన్లలో మార్పులు ఉంటాయన్న వాదనలు బలంగా విన్పిస్తున్నాయి.

Updated Date - Oct 03 , 2025 | 10:27 PM