Share News

kumaram bheem asifabad- కార్మికక్షేత్రం.. ఆహ్లాదకరం

ABN , Publish Date - Jun 17 , 2025 | 11:14 PM

సింగరేణి కార్మిక కు టుంబాలు నివసించే ప్రాంతాలు పచ్చదనంతో ఆహ్లాదం కలిగిస్తున్నాయి. బెల్లంపల్లి ఏరియాలో ఎక్కడ చూసినా హరితమ యంగా మారాయి. పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని భావించిన సింగరేణి యాజమాన్యం ఏటా లక్షల్లో సంఖ్యలో మొక్కను నాటు తూ పరిరక్షణకు చర్యలు తీసుకుంటోంది.

kumaram bheem asifabad- కార్మికక్షేత్రం.. ఆహ్లాదకరం
అధికారుల కాలనీలో ఆహ్లాదకరంగా ఉన్న చెట్లు

- మొక్కలు నాటి సంరక్షిస్తున్న యాజమాన్యం

రెబ్బెన, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మిక కు టుంబాలు నివసించే ప్రాంతాలు పచ్చదనంతో ఆహ్లాదం కలిగిస్తున్నాయి. బెల్లంపల్లి ఏరియాలో ఎక్కడ చూసినా హరితమ యంగా మారాయి. పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని భావించిన సింగరేణి యాజమాన్యం ఏటా లక్షల్లో సంఖ్యలో మొక్కను నాటు తూ పరిరక్షణకు చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా మొక్కలు ఏపుగా వచ్చి ఆహ్లాదకరంగా కన్పిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉద్యాన వనాలను కూడా ఏర్పాటు చేసింది. కాలుష్య నివారణతో పాటు కార్మిక కుటుంబాలు ఆహాదకరాన్ని సమకూర్చుతోంది.

- పచ్చని చెట్లతో సింగరేణి ఉద్యానవనం

గోలేటిటౌన్‌ షిప్‌లోని సింగరేణి ఉద్యానవనం పచ్చని చెట్లతో నిండిపోయింది. రక రకా మొక్కలతో పాటు సువాన వెదజల్లే పూల మొక్కలు సందర్శకులను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేశారు. కార్యాలయంలో పని చేసే సిబ్బంది కాసేపు చెట్ల కింద సేద తీరిన తరువాతే విధుల్లోకి వెళుతున్నారు.ఈ వనంలోకి అడుగు పెట్టగానే పచ్చని చెట్లు స్వాగతం పలుకతాయి. నిత్యం చిన్న పిల్లలతో పాటు పెద్దలు కాలక్షేపం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఎత్తైన చెట్లతో పాటు పూలను చూస్తూ ఆనందపడిపోతుంటారు. హరితహరాన్ని సంరక్షించుకోవటానికి యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించి సిబ్బందితో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. గోలేటి లోని కోదండ రామాలయం ఆవరణలో ఉన్న చెట్లు చల్లటి నీడతో పాటు మంచి వాతావరణాన్ని అందిస్తాయి. మొక్కలు తీర్చుకునేందుకు వచ్చే భక్తులు, పూజల అనంతరం కాసేపు చెట్ల కింద సేద తీర్చుకుంటున్నారు. గోలేటి సీఈఆర్‌ క్లబ్‌, షటిల్‌ కోర్టు, ఆఫీసర్‌ క్లబ్‌, గెస్ట్‌ హౌస్‌, కార్మికులు, అధికారుల క్వార్టర్ల పరిధిలో పచ్చని చెట్లు ఆకర్షిస్తున్నాయి. క్లబ్‌లో వివిధ శుభ కార్యాలయాలు చేసుకునే వారికి ఆహ్లాదకరమైన వాతావవరణంలో పలుకరిస్తాయి. సీఈఆర్‌ క్లబ్‌లోకి వెళ్లే ముఖ ద్వారం నుంచి మొదలుకొని భవనంలోకి వెళ్లే వరకు ఇరువైపులా పచ్చని చెట్లు చక్కటి నీడనిస్తాయి. దీంతో పాటు సింగరేణి డిస్పెన్సరీ, కార్మిక వాడల్లో రహదారికిరువైపులా పెరిగిన చెట్లు చక్కటి వాతావరణాన్ని అందిస్తున్నాయి.

Updated Date - Jun 17 , 2025 | 11:14 PM