మహిళల సంక్షేమమేప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:13 PM
దేశంలో మహిళల సంక్షేమం కోసం పనిచేస్తు న్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి అన్నారు.
- నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి
అచ్చంపేటటౌన్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : దేశంలో మహిళల సంక్షేమం కోసం పనిచేస్తు న్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి అన్నారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన కుట్టు మిషన్లను పట్టణంలో ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లిం మైనార్టీ మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్య క్రమానికి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీబీ చైర్మన్ మా మిళ్లపల్లి విష్ణువర్ధ న్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణతో కలిసి ఆయన పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ నిరుపేద లకు ఇందిరమ్మ ఇళ్లు, యు వత ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం ద్వారా వారికి త్వరలో రుణాలు మంజూరు చేసి ఉపాధి కల్పిస్తామన్నారు. ని యోజకవర్గంలో దాదాపు 39వేల సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేసి రైతులకు అదనంగా ఆదాయవనరులు కలిపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మునిసిపల్ చైర్మన్ శ్రీనివా సులు, నాయకులు పాల్గొన్నారు.