పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jun 08 , 2025 | 12:36 AM
పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్నట్లు ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి
తిరుమలగిరి(సాగర్), జూన 7 (ఆంధ్రజ్యోతి): పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్నట్లు ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అన్నారు. మండలంలోని బోయగూడెం గ్రామంలో శనివారం 226 మంది పేదలకు ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డితో కలిసి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు 20 సంవత్సరాల క్రితం తన తండ్రి జానారెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు కృషి చేశారని, అనివార్య కారణాల వల్ల ఆగిపోయాయని ప్రస్తుతం తన హయాంలో అందజేస్తున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. గ్రామాభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. వాగు వెంట వ్యవసాయ మోటార్లకు ఉన్న విద్యుత సమస్య పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఇంకా ఎవరైనా అర్హులకు రానట్లయితే వారికి కూడా వచ్చే విధంగా తాను కృషి చేస్తానని అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్థుల ఆధ్వర్యంలో గ్రామంలోని వీదుల గుండా ఊరేగింపు నిర్వహించారు. తహసీల్దార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన కలసాని చంద్రశేఖర్, డీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గడ్డం సాగర్‌రెడ్డి, నాయకులు అల్లి పెద్దిరాజు, యడవెల్లి వల్లభరెడ్డి, శాగం రాఘవరెడ్డి, రమావత కృష్ణానాయక్, గోదాల వెంకట్‌రెడ్డి, గడ్డం నవీనరెడ్డి, రామకృష్ణ, మెరావత మునినాయక్ తదితరులు పాల్గొన్నారు.
బస్ షెల్టర్‌లో కూర్చొని సమస్యలను విని...
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయడానికి బోయగూడెం గ్రామానికి వెళ్లే క్రమంలో ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి తిరుమలగిరి(సాగర్) మం డల కేంద్రంలో గ్రామస్థులను చూసి తన వాహనాన్ని ఆపారు. ఆయన రోడ్డు పక్కనే ఉన్న బస్ షెల్టర్‌లో కూర్చున్న వారి వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి తక్షణమే కృషి చేశారు. ఈ సందర్భం గా మండల కేంద్రానికి చెందిన గాలమ్మ అనే మహిళ తన కోడలు ఒంటరిగా ఉంటుందని ఆమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కా లేదని ఎమ్మెల్యేకు విన్నవించింది. దీంతో తక్షణమే స్పందించిన ఆయన ఆమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. గ్రామంలోని రామాలయం వీదిలో కొన్ని రోజులుగా మిషన భగీరథ నీరు రావట్లేదని ఫిర్యాదు చేయగా సంబంధిత అధికారులకు ఫోన చేసి ఆ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానికులతో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వారి బాగోగుల గురించి ఆరా తీసి కొద్దిసేపు ముచ్చటించి అక్కడి నుంచి బోయగూడెం గ్రామానికి వెళ్లారు.
కల్యాణలక్ష్మి పేదింటి ఆడపడుచులకు వరం
మాడ్గులపల్లి: కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపడుచులకు వరం లాంటిదని ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కన్నెకల్ గ్రామంలో శనివారం నిర్వహించిన సమావేశంలో మండలంలోని గారకుంటపాలెం, మాచినపల్లి, నారాయణపురం గ్రామాలకు చెందిన 9 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. పేదల సంక్షేమానికి ప్రభు త్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. స మావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య, పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు బోడ యాదయ్య, భాస్కర్‌రెడ్డి, కొండేటి వెంకన్న, శ్రీను తదితరులు పాల్గొన్నారు.