Share News

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:34 PM

పేద సంక్షేమమే ప్రభుత్వ ధ్యే యమని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకటస్వామి అన్నారు. మం డలంలోని కుందారంలో నూతనంగా రూ. 20 లక్షలతో నిర్మించిన మహి ళా భవనాన్ని గురువారం ప్రారంభించారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామిని సన్మానిస్తున్న మహిళలు

ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి

జైపూర్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి) : పేద సంక్షేమమే ప్రభుత్వ ధ్యే యమని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకటస్వామి అన్నారు. మం డలంలోని కుందారంలో నూతనంగా రూ. 20 లక్షలతో నిర్మించిన మహి ళా భవనాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, అభివృద్ధికి పె ద్దపీట వేస్తుందన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. అనంతరం జై బాపు, జై భీమ్‌ జై సంవిధాన్‌ కార్యక్రమంలో భాగంగా నాయకులు, కార్యకర్తలతో గ్రామంలో ర్యాలీ ని ర్వహించారు భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి దన్నారు. అనంతరం ఐకేపీ మహిళలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానిం చారు. ఎంపీడీవో సత్యనారాయణ, ఆర్‌డబ్య్లూఎస్‌ డీఈ విద్యాసాగర్‌ రావు, ఏపీఎం రాజ్‌కుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

ఫమండలంలోని కుందారం గ్రామానికి చెందిన మీనాక్షి గ్రేస్‌ కెప్టెన్‌ నుంచి ఇటీవల మేజర్‌గా పదోన్నతి పొందగా గురువారం ఆమెను ఎ మ్మెల్యే వివేక్‌ ఘనంగా శాలువాలతో సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 11:34 PM