Share News

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Jun 04 , 2025 | 11:02 PM

పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయ మని నాగర్‌కర్నూల్‌ ఎమ్మె ల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేశ్‌ రెడ్డి అన్నారు.

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

- నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి) : పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయ మని నాగర్‌కర్నూల్‌ ఎమ్మె ల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేశ్‌ రెడ్డి అన్నారు. భుదవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మె ల్యే రాజేష్‌రెడ్డి పలువురు లబ్ధిదారులకు కల్యా ణలక్ష్మి, షాదీముబాకర్‌తోపాటు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడు తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలు పూ ర్తిగా అవగాహన కలిగి ఉండి సద్వినియోగం చేసుకో వాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు వినోద్‌కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ వివిధ మండలాల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 11:02 PM