ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Aug 09 , 2025 | 11:23 PM
రాష్ట్రంలో ప్రజల సంక్షేమం ప్రగతే లక్ష్యంగా తమ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని యువజన విభాగం నాయకులు రాయబారపుకిరణ్, జావీద్‌ఖాన్, శంకర్ పేర్కొన్నారు. శని వారం పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద విలేకరులతో మా ట్లాడారు. బీఆర్‌ఎస్ పదేళ్ల కాలంలో నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలే దని పేర్కొన్నారు.
మందమర్రిటౌన్, ఆగస్టు9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజల సంక్షేమం ప్రగతే లక్ష్యంగా తమ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని యువజన విభాగం నాయకులు రాయబారపుకిరణ్, జావీద్‌ఖాన్, శంకర్ పేర్కొన్నారు. శని వారం పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద విలేకరులతో మా ట్లాడారు. బీఆర్‌ఎస్ పదేళ్ల కాలంలో నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలే దని పేర్కొన్నారు. 18నెలల్లో తమమంత్రి డాక్టర్ జి. వివేక్ స్వామి విద్యా, వైద్యానికి వందల కోట్లు తీసుకొచ్చి అభివృద్ధిలో ముందు నిలిపారని పే ర్కొన్నారు. ఇప్పటికే అభివృద్ధిని చూసి తట్టుకోలేని వారు లేని పోని వి మర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ర్టాన్ని అభివృద్ధిలో నెంబర్ వన్‌గా నిలుపడంతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత పాలకుల విధానాల మూలంగా రాష్ట్రంలో ఖజాన లోటు బడ్టెట్‌లో ఉన్నప్పటికీ సం క్షేమ పథకాలకు డోకా లేకుండ కల్పిస్తున్న ఘనత తమదే అని తెలిపా రు. రానున్న స్థానిక ఎన్నికల్లో మళ్లీ మెజార్టీ స్థానాలను తమ పార్టీ విజ యం సాధిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు గణేష్, సు రేందర్, సాయికిరణ్, సతీష్, చింటు, సైగన్, తరుణ్, వేణు, రాజేశ్, మ ణిదీప్, సోమెల్, బన్ని పాల్గొన్నారు.
ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు...
పట్టణంలోని మంత్రిక్యాంప్ కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ ఆవి ర్భావ వేడుకలను యూత్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహిం చారు. నాయకులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. స్థానిక సంస్థలోఎన్నికల్లో పార్టీ కోసం పని చేయాలని సూచించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు కిరణ్, జావీద్‌ఖాన్, శశిధర్, రవికిరణ్, పాల్గొన్నారు.