Share News

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం...

ABN , Publish Date - Dec 31 , 2025 | 11:29 PM

ప్రజల సంక్షే మమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని కలెక్టర్‌ కు మార్‌ దీపక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్‌ హాలులో బుధవారం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీము బారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్‌ స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావుతో కలిసి పాల్గొన్నారు.

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం...

ఫమహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు అనేక పథకాలు

ఫకలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

ఫనియోజక వర్గ అభివృద్ధికి కృషి.. ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

మంచిర్యాల, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ప్రజల సంక్షే మమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని కలెక్టర్‌ కు మార్‌ దీపక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్‌ హాలులో బుధవారం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీము బారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్‌ స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అ లుపెరగని విధంగా కృషి చేస్తుందన్నారు. మహిళల ఆత్మగౌర వాన్ని పెంపొందించే విధంగా ప్రభుత్వం అనేక పథకాలు ప్ర వేశపెట్టి, సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా పేదింటి ఆడపడుచు పెళ్లికి ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా నగదు అందజేస్తుందన్నారు.

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు మాట్లాడు తూ నియోజక వర్గం అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చే స్తానన్నారు. అభివృద్ధిలో భాగంగా ప్రజలకు ఇవ్వని హామీలు ఎన్నో ఇప్పటి వరకు నెరవేర్చానని తెలిపారు. ఇచ్చిన హామీల కుగాను ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తి అయ్యాయని, మిగతా 20 శాతం త్వరలోనే పూర్తి చేస్తానన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో రాష్ట్రంలోనే నియోజక వర్గం మొదటి స్థానంలో ఉందన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా అర్హులకే దక్కేలా అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర సమస్యలు ఏమీ ఉన్నా ఫొటోలతో వివరాలు తన కార్యాలయం లో అందజేస్తే తక్షణ పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. డబ్బులు ఉన్నాయా...? లేవా...? అన్న సమస్య అవసరం లేదని, ప్రభు త్వం విడుదల చేసే ప్రతి రూపాయి గ్రామాల అభివృద్దికే కే టాయిస్తానని తెలిపారు. సీఎం సహాయనిధి ద్వారా ఆపదలో ఉన్న ప్రజలకు ప్రభుత్వం అండగా నిలబడుతోందన్నారు. ఈ సందర్భంగా నియోజక వర్గానికి చెందిన రూ. 10,97,500 వి లువ గల చెక్కులను 40 లబ్దిదారులకు, అలాగే 138 మంది లబ్దిదారులకు రూ. కోటి 38 లక్షల 16వేల విలువైన చెక్కులను కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం కింద ఎమ్మెల్యే, కలెక్టర్‌ చేతుల మీదుగా అందజేశారు. లక్షెట్టిపేట మండలానికి చెందిన పలువురు రైతుల వద్ద వడ్లు కొనుగోలు చేసిన వ్యాపారి పలా యనం చిత్తగించగా, రైతులు మోసపోకుండా ఉండేందుకు గాను ఎమ్మెల్యే ప్రత్యేక కృషితో పోలీసుల సహకారంతో నగదు ను రికవరీ చేయించారు. ఆ నగదును సైతం కార్యక్రమం సం దర్భంగా బాఽధిత రైతులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, హాజీపూర్‌ మండలాల తహసీల్దార్లు ఎండీ రఫతుల్లాఖాన్‌, శ్రీనివాసరావు దేశ్‌పాండే, మంచిర్యాల డిప్యూటీ తహసీల్దార్‌ ప్రసాద్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2025 | 11:29 PM