ప్రజల సంక్షేమమే లక్ష్యం
ABN , Publish Date - Jul 13 , 2025 | 11:53 PM
పాలకవర్గం లేని మందమర్రి మున్సిపాలిటిని రాష్ట్రంలోనే మెగా మున్సిపాలిటిగా తీర్చిది ద్దేందుకు కృషి చేస్తున్నానని రాష్ట్ర కార్మిక ఉ పాధి కల్పన గనులశాఖ మంత్రి డాక్టర్ వివే క్ వెంకటస్వామి పేర్కొన్నారు.
మున్సిపాలిటి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు
మందమర్రిటౌన్, జూలై13 (ఆంధ్రజ్యోతి): పాలకవర్గం లేని మందమర్రి మున్సిపాలిటిని రాష్ట్రంలోనే మెగా మున్సిపాలిటిగా తీర్చిది ద్దేందుకు కృషి చేస్తున్నానని రాష్ట్ర కార్మిక ఉ పాధి కల్పన గనులశాఖ మంత్రి డాక్టర్ వివే క్ వెంకటస్వామి పేర్కొన్నారు. ఆదివారం ప ట్టణంలోని 23వ వార్డు బురద గూడెంలో మంత్రి మార్నింగ్‌వాక్ చేపట్టారు. వార్డులో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలు సుకున్నారు. అనంతరం విలేకరుల సమావే శంలో మాట్లాడుతూ మున్సిపాలిటి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఏకైక లక్ష్యంగా ముం దుకు వెళ్తున్నానని తెతిపారు. ఎన్నికల ముం దు ప్రజలకు ఇచ్చిన హామీలను కూడ నెరవే రుస్తున్నామని ఆయన తెలిపారు. మున్సిపా లిటిలోనే 24 వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు పను లు పూర్తి కావాల్సి వచ్చిందని తెలిపారు. తా ను మున్సిపాలిటికి 8కోట్లకుపైగా నిధులు మంజూరు చేశామని తెలిపారు. మున్సిపాలి టిలో అమృతస్కీం పథకం కింద మందమ ర్రి, క్యాతన్‌పల్లి సంయుక్తంగా 30కోట్లతో తా గునీటి పైపులైన్‌లు పనులు సాగుతున్నా యని తెలిపారు. గతంలో ఏ ఎమ్మెల్యే చేయ ని విధంగా దాదాపు నియోజకవర్గంలో అన్ని గ్రామాలు పట్టణాల సమగ్ర అభివృద్ధికి ప్ర ణాళికల రూపొందించి పనులు చేపడుతు న్నామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా దాదా పు 200 కోట్లకు పైగా విద్యా, వైద్యానికి సం బంధించిన అభివృద్ధి పనులు జరుగుతున్నా యన్నారు. ఈసందర్భంగా 23వ వార్డులో రో డ్లు, డ్రైనేజీ పనులు కావాలని ప్రజలు అడు గగా కమిషనర్ రాజలింగుతో పనుల ప్రతిపా దన పంపాలని నిధులు ఉంటే వెంటనే పను లు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో వార్డు నాయకులు దుర్గం ప్రభాకర్‌తో పా టు కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంఘా ల నాయకులు పాల్గొన్నారు.