Share News

విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Sep 25 , 2025 | 11:05 PM

రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాల ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నా గర్‌కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి కోరారు.

విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఐనోలులో మినీ లైబ్రరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ, నాయకులు, కార్యకర్తలు

- నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ, డీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి

- డిజిటల్‌ లైబ్రరీలకు శంకుస్థాపన

అచ్చంపేటరూరల్‌, సెప్టెంబరు25 (ఆంధ్రజ్యో తి) : రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాల ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నా గర్‌కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి కోరారు. గు రువారం అచ్చంపేట మండలం ఐనోల్‌ గ్రామం లో నూతనంగా నిర్మిస్తున్న మినీ గ్రంథాలయ భ వనానికి భూమి పూజచేసి పనులను ప్రారంభిం చారు. త్వరలో గ్రంథాలయంలో పుస్తకాలు ఏ ర్పాటు చేస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేందర్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

డిజిటల్‌ గ్రంథాలయాలు యువతకు వరం

లింగాల : నిరుద్యోగ యువతకు ఇంటర్నెట్‌ సేవలతో కూడిన డిజిటల్‌ లైబ్రరీ ఒకవరం వం టిదని నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ సభ్యుడు డాక్ట ర్‌ మల్లు రవి అన్నారు. గురువారం మండ ల పరిధిలోని సురాపూర్‌ సమీపంలో రూ.3కోట్లతో గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశా లభవనం, అంబటిపల్లి గ్రా మంలో రూ.26లక్షలతో ని ర్మించనున్న డిజిటల్‌ లైబ్ర రీ భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ తో కలిసి ఎంపీ శంకుస్థా పనచేశారు. ఎమ్మెల్యే వం శీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రం లో విద్యారంగాన్ని సము న్నత స్థాయిలో నిలిపేందు కు విద్యాశాఖకు అధిక ప్రా ధాన్యతనిస్తూ బడ్జెట్‌లో పె ద్దపీట వేస్తుందన్నారు. కార్య క్రమంలో ఆర్డీవో మాధవీల త, మాజీ సింగిల్‌ విండో అధ్యక్షుడు శ్రీనివాస్‌ రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రాజేందర్‌, కాం గ్రెస్‌ మండల అధ్యక్షుడు నాగేశ్వర్‌రావు, నాయ కులు, అధికారులు పాల్గొన్నారు.

ఫ కల్వకుర్తి మండలం గుండూరు గ్రామం లో గ్రంథాలయ భవన నిర్మాణానికి ఎంపీ డాక్ట ర్‌ మల్లురవి, ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మ న్‌ రాజేందర్‌, కాంగ్రెస్‌ నాయకులు బృంగి ఆ నంద్‌కుమార్‌, వెంకటేశ్వర్‌రావు, విజయ్‌కుమార్‌ రెడ్డి, సురేందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

ఆలయ అభివృద్ధికి కృషి

ఉప్పునుంతల : ప్రభుత్వం దృషికి తీసుకెళ్లి ఆ లయ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే డా క్టర్‌ వంశీకృష్ణ, ఎంపీ మల్లురవి అన్నారు. గురు వారం మండల పరిధిలోని ఈర్వటోనిపల్లి గ్రామ సమీపంలోని రామాలయంలో గ్రామస్థులు య జ్ఞం నిర్వహించారు. గ్రామస్థుల ఆహ్వానం మేర కు ఎంపీ, ఎమ్మెల్యే యజ్ఞంలో పాల్గొన్నారు. కాం గ్రెస్‌ నాయకులు అనంతరెడ్డి, భాస్కర్‌, మాజీ సర్పంచ్‌ లింగమయ్య, పంచాయతీ కార్యదర్శి శేఖర్‌ ఉన్నారు.

Updated Date - Sep 25 , 2025 | 11:05 PM