ఓటరు జాబితాను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Oct 28 , 2025 | 10:08 PM
ఓటరు జాబి తాను పకడ్బందీగా తయారు చేయాలని ఆర్డీవో సురేశ్ అ న్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమాన్ని మంగళ వారం ఆర్డీవో పరిశీలించారు.
- బీఎల్‌వోల శిక్షణను పరిశీలించిన ఆర్డీవో
తెలకపల్లి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : ఓటరు జాబి తాను పకడ్బందీగా తయారు చేయాలని ఆర్డీవో సురేశ్ అ న్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమాన్ని మంగళ వారం ఆర్డీవో పరిశీలించారు. మండల కార్యాలయంలోని సమావేశాలలో స్థానిక ఎన్నికలకు సంబంధించి బూత్ లెవెల్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో సురేష్ శిక్షణ కార్యక్ర మాన్ని పరిశీలించారు. స్థానిక ఎన్నికల సంద ర్భంగా ఓటర్ల జాబితాను ఏబీసీడీలుగా వర్గీకరి స్తున్నారు. ఎన్నికలకు సంబంధించి పలు అంశా లపై శిక్షణ ఇస్తున్నారు. కార్యక్రమంలో తహసీ ల్దార్ జాకీర్ అలీ, డిప్యూటీ తహసీల్దార్ పట్టాభి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఓటరు జాబితాను సరి చేయాలి
- డిప్యూటీ తహసీల్దార్ జ్యోతి
తిమ్మాజిపేట, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : ఓటరు జాబితాలో ఉన్న అవకతవకలను వెం టనే సరి చేయాలని డిప్యూటీ తహసీల్దార్ జ్యోతి సూచించారు. మండల కేంద్రంలోని తహ సీల్దార్ కార్యాలయంలో మంగళవారం బూత్ లెవల్ అధికారులతో ప్రతేక నమోదు క్యాంపు నిర్వహించి అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ఓటరు జాబితాలో భార్యాభర్తలు ఒకేచోట ఉండేలా చూడాల న్నారు. ఓటరు జాబితాలో ఒకే పేరు మీద రెండు ఓటర్లుగా నమోదైతే తొలగించాలని సూ చించారు. గ్రామంలో చనిపోయిన ఓట రును జాబితా నుంచి తొలగించి, ఎలాంటి అవక తవకలు లేకుండా ఓటరు జాబితాను త్వరగా సిద్ధం చేయాలని సూచించారు.