Share News

తీగలు అటు..నరికివేతలు ఇటు

ABN , Publish Date - Oct 05 , 2025 | 11:23 PM

మండలంలోని నంనూర్‌, గుడిపే ట ఎల్లంపల్లి పునరావాస కాలనీల్లో గతంలో హరితహారంలో భాగంగా పెం చిన చెట్లను విద్యుత్‌శాఖ అధికారులు స్థానిక లైన్‌మెన్‌ కరెంటు తీగలకు అడ్డువస్తున్నాయనే నెపంతో తీగల కిందివే కాకుండా ఆమడదూరంలో ఉన్న వృక్షాలను సైతం మొదలు వరకు నరికివేయించారు.

తీగలు అటు..నరికివేతలు ఇటు
నంనూర్‌ ఆర్‌అండ్‌ ఆర్‌ కాలనీలో నరికివేతకు గురైన చెట్లు

విద్యుత్‌ అధికారుల తీరుపై గ్రామస్థుల ఆగ్రహం

హాజీపూర్‌, అక్టోబరు5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నంనూర్‌, గుడిపే ట ఎల్లంపల్లి పునరావాస కాలనీల్లో గతంలో హరితహారంలో భాగంగా పెం చిన చెట్లను విద్యుత్‌శాఖ అధికారులు స్థానిక లైన్‌మెన్‌ కరెంటు తీగలకు అడ్డువస్తున్నాయనే నెపంతో తీగల కిందివే కాకుండా ఆమడదూరంలో ఉన్న వృక్షాలను సైతం మొదలు వరకు నరికివేయించారు. వేసవిలో కాలనీ వాసు లు సేదతీరుతున్న వృక్షాలు నేడు నేలకొరగడంతో కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌శాఖ లైన్‌మెన్‌ ఇతర అధికారులు కలిసి చెట్లు నరికే గుత్తెదారుతో ఒప్పందం చేసుకుని తీగలకు అడ్డువచ్చే చెట్లేకాకుండా సంబంధంలేని అడ్డుగాలేని భారీ వృక్షాలను కూడ నేలమట్టం చేయడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సోమవారం కలె క్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ రెండు పునరావాస కాలనీల్లో 80కిపైగా చెట్లను నరికివేశారు. అందులో 30చెట్లు తీగలకు అడ్డు లేకుండా నరికివేశారని గ్రామస్తులు చెబుతున్నారు. తీగలకు అడ్డుగా ఉంటే కొమ్మలు మాత్రమే నరికివేయాలే గాని ఇలా భారీ వృక్షాలను నేలమట్టంగా నరికివేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 05 , 2025 | 11:23 PM