kumaram bheem asifabad- ఊరు ఏకమైంది..పోరు తప్పింది..
ABN , Publish Date - Dec 19 , 2025 | 10:06 PM
గ్రామీణ ప్రాంతాల్లో శాంతి, సామరస్యం నెలకొల్పడానికి ప్రభుత్వాలు ఎకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించాయి. ఎన్నికల ఖర్చులను అభివృద్ధికి మళ్లించి , ప్రజల సౌకర్యం పెంచాలనే లక్ష్వంతో ఈ విధానం అమలు చేశాయి. కానీ ఏకగ్రీవ పంచాయతీలకు కేటాయించాల్సిన ప్రత్యేక నిధులు అందడం లేదు.
- 2019తో పోల్చితే 39 తక్కువ
- గత ప్రభుత్వం నుంచి అందని నజరానా
ఆసిఫాబాద్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో శాంతి, సామరస్యం నెలకొల్పడానికి ప్రభుత్వాలు ఎకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించాయి. ఎన్నికల ఖర్చులను అభివృద్ధికి మళ్లించి , ప్రజల సౌకర్యం పెంచాలనే లక్ష్వంతో ఈ విధానం అమలు చేశాయి. కానీ ఏకగ్రీవ పంచాయతీలకు కేటాయించాల్సిన ప్రత్యేక నిధులు అందడం లేదు. గత ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయ తీలకు రూ.10 లక్షల నజరానా ప్రకటించింది. కాని సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసినా నజరానా అందలేదు. దీంతో ఈ సారి ఏకగ్రీవానికి చాలా మంది మొగ్గు చూపలేదు. పోటీకే సై అన్నారు. జిల్లాలో జరిగిన మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమ య్యాయి.
జిల్లాలో మూడు విడతల్లో..
జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. కానీ ఈసా రి జిల్లాలో 10 గ్రామ పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. 2019 లో 49 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. గత ప్రభుత్వం 10 లక్షలు ప్రకటించిన నజరానాలు అందలేదు. ఏకగ్రీవాల నజరానాలు రాకపోవడంతో గ్రామీణుల్లో నమ్మకం సడలింది. .2019 తో పోలిస్తే 39 పంచాయతీ స్థానాలు తగ్గాయి. జిల్లాలో మొత్తం 335 గ్రామ పంచాయతీలు ఉండగా మొదటి విడతలో జరిగిన 113 పంచాయతీ ఎన్నికల్లో వాంకిడి మండలం లోని దాబా, లెండిగూడ , నవేగూడ, లింగాపూర్ మండలంలోని కంచన్‌పల్లి , మామిడిపల్లి, కెరమెరి మండలంలోని దనోరా, బాబేఝరి మొత్తం ఏడు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. రెండో విడతలో జరిగిన 113 పంచాయతీ ఎన్నిక ల్లో సిర్పూర్-టి మండలంలోని భూపాలపట్నం పంచాయతీ ఏకగ్రీవమైంది. మూడో విడతలో జరిగిన 106 పంచాయతీలలో కాగజ్‌నగర్ మండలంలోని రేగులగూడ, చింతగూడ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మొత్తం మూడు విడతల్లో పది పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.
- గత ఎన్నికల్లో..
జిల్లాలో 2019లో 335 గ్రామపంచాయతీలు ఉండగా 286 గ్రామపంచాయతీలకు మూడు విడ తలుగా నిర్వహించిన ఎన్నికల్లో 49 పంచాయ తీలు ఏకగ్రీవం అయ్యాయి. కౌటాల మండలంలో తలోడి, కన్కి, శిర్షా, నవేగాం గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమ య్యాయి. అదే విధంగా బెజ్జూరు మండలంలో అంబగట్టు, సుస్మీర్, కాటేపల్లి, తలాయి, సులుగుపల్లి, అందుగులగూడ, కుకుడ, పెంచికలపేట మండలంలో కొండపల్లి, మొర్లిగూడ, దహెగాం మండలంలో ఐనం, దిగిడ, రాంపూర్, చింతలమానేపల్లి మండ లంలో ఆడెపల్లి, తిర్యాణి మండలంలో భీంజిగూడ, గోవెన, మర్కగూడ, గోపెర(నాగుగూడ), మొర్రిగూడ, గుండాల, ముల్కలమంద, రెబ్బెన మండలంలో తక్కళ్లపల్లి, కాగజ్‌నగర్ మండలంలో అనుకోడ, భట్టుపల్లి, ఈసుగాం, జగన్నాథ్‌పూర్, లైన్‌గూడ, రేగులగూడ, కెరమెరి మండలంలో కరంజీవాడ, రింగన్‌ఘాట్, వాంకిడి మండలంలో దాబా, నవేగూడ, పాటగూడ, పిప్పర్‌గొంది, సవ్వాతి, సిర్పూర్(యూ) మండలం లో బాండేయర్, సీతాగొంది, లింగాపూఏర్ మండ లంలోని గుమ్నూర్(బి), చిన్నదాంపూర్, జైనూరు మండలంలో రాంనాయక్‌తండా, దుబ్బగూడ, మా ర్లవాయి, పారా, పవర్‌గూడ, రాశిమెట్ట, ఊసేగాం పంచాయతీలు ఏకగ్రీవమై ప్రోత్సాహనికి అర్హతగా నిలిచాయి. కానీ ప్రోత్సాహక నిధులు మాత్రం గత ప్రభుత్వం మంజూరు చేయలేదు. దీంతో ఈసారి జరిగిన పంచాయతీ ఏన్నికల్లో ఏకగ్రీవానికి చాలా మంది మొగ్గు చూపలేదు