Share News

తరం మారినా విద్య విలువ మారదు

ABN , Publish Date - Aug 23 , 2025 | 11:30 PM

త రం మారినా విద్య విలువ మారదని, ప్రతీ వి ద్యార్థి విజ్ఞానార్జనతో ముందుకు సాగాలని ఎమ్మె ల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు.

తరం మారినా విద్య విలువ మారదు
విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి

- ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి

కందనూలు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : త రం మారినా విద్య విలువ మారదని, ప్రతీ వి ద్యార్థి విజ్ఞానార్జనతో ముందుకు సాగాలని ఎమ్మె ల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం లోని శ్రీపురంరోడ్డులో గల డిగ్రీ కళాశాలను వి ద్యార్థుల ఆహ్వానం మేరకు శనివారం ఎమ్మెల్యే సందర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం సంద ర్భంగా కూచకుళ్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కళాశా లకు 15 గ్రీన్‌ బోర్డులను అందజేశారు. ఎమ్మెల్యే ను అధ్యాపకులు సన్మానించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ నాయకులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు పూర్తి అ వగాహన ఉండాలని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో తిమ్మాజిపేట, తాడూరు, తెలకపల్లి మండలాలకు సంబంధించిన ప లువురికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు లను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ మండ లాల అధ్యక్షులు, పట్టణ అ ధ్యక్షులు, పార్టీ సీనియర్‌ నా యకులు, యువజన నాయ కులు, మహిళలు, లబ్ధిదారు లు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యం

బిజినేపల్లి : రాష్ట్రంలో రెండే ళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌ రెడ్డి అన్నారు. మండలంలోని వెల్గొండ గ్రామం లో నూతన అంగన్‌వాడీ భవనం నిర్మాణానికి భూమి పూజ, నూతన గ్రామ పంచాయతీ భవ నం, పల్లె దవాఖాన భవనాన్ని రిబ్బన్‌ కట్‌ చేసి శనివారం ప్రారంభించారు. అలాగే బిజినేపల్లిలో ని ప్రాథమిక పాఠశాల ప్రహరీ, ఆనందగిరి గుట్టపై నిర్మించిన నూతన కమ్యూనిటీ హాల్‌ భవనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మా ర్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, స్థలదాత లగిశెట్టి వెంకటస్వామి, నగేష్‌, మల్లేష్‌, తిరుప తయ్య గౌడ్‌, ఈర్ల శ్రీకాంత్‌, మోహన్‌రెడ్డి, లక్ష్మా రెడ్డి, కాంగ్రెస్‌ మండల నాయకులు మిద్దె రా ములు, రామచందర్‌, అమృత్‌రెడ్డి, కర్నాటి తిరుపతయ్య, వెంకటేష్‌ గౌడ్‌ ఉన్నారు.

Updated Date - Aug 23 , 2025 | 11:30 PM