Share News

kumaram bheem asifabad- ఉపసర్పంచ్‌ ఎన్నికను తిరిగి నిర్వహించాలి

ABN , Publish Date - Dec 15 , 2025 | 12:23 AM

పంచాయతీ రాజ్‌ నిబంధనలకు విరుద్దగా జరిగిన వాంకిడి పంచాయతీ ఉప సర్పంచ్‌ ఎన్నికను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ చునార్‌కార్‌ సతీష్‌తో పాటు ఆరుగురు వార్డు సభ్యులు డిమాండ్‌ చేశారు. ఆదివారం వారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గురువారం రోజున ఎన్నికల అధికారి ఉప సర్పంచ్‌ పదవికి నిర్వహించిన ప్రక్రియలో ఒక వార్డు సభ్యుడు దీపక్‌ముండేను ప్రతిపాదించగా, మరో సభ్యుడు మండోకర్‌ తుర్సాబాయిని ప్రతిపాదించారని అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో వార్డు సభ్యులు దీపక్‌ముండేకు ఆరుగురు, తుర్సాబాయికు ఆరు గురు చేతులెత్తడం జరిగిందన్నారు

kumaram bheem asifabad- ఉపసర్పంచ్‌ ఎన్నికను తిరిగి నిర్వహించాలి
మాట్లాడుతున్నసర్పంచ్‌, వార్డు సభ్యులు

వాంకిడి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : పంచాయతీ రాజ్‌ నిబంధనలకు విరుద్దగా జరిగిన వాంకిడి పంచాయతీ ఉప సర్పంచ్‌ ఎన్నికను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ చునార్‌కార్‌ సతీష్‌తో పాటు ఆరుగురు వార్డు సభ్యులు డిమాండ్‌ చేశారు. ఆదివారం వారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గురువారం రోజున ఎన్నికల అధికారి ఉప సర్పంచ్‌ పదవికి నిర్వహించిన ప్రక్రియలో ఒక వార్డు సభ్యుడు దీపక్‌ముండేను ప్రతిపాదించగా, మరో సభ్యుడు మండోకర్‌ తుర్సాబాయిని ప్రతిపాదించారని అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో వార్డు సభ్యులు దీపక్‌ముండేకు ఆరుగురు, తుర్సాబాయికు ఆరు గురు చేతులెత్తడం జరిగిందన్నారు. ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చినప్పుడు సర్పంచ్‌ ఓటును పరిగణలోకి తీసుకొని ఉప సర్పంచ్‌ ఎన్నుకోవాల్సి ఉండగా ఎన్నికల అధికారి సర్పంచ్‌ ఓటును పరిగణలోకి తీసుకోకుండా అభ్యర్థి దీపక్‌ముండేకు వత్తాసు పలుకుతూ కాలయాపన చేశారని వారు ఆరోపించారు. రాత్రి 2 గంటల తరువాత ఎంపీడీఓ సర్పంచ్‌ను, ఆరుగురు వార్డు సభ్యులను గదిలో పలిపించి దీపక్‌ముండేకు సహాకరించాలని లేని పక్షంలో ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేసి 3 పర్యాయాలు ఎన్నికల్లో పోటీ చేయకుండా మీ సభ్యత్వం రద్ద చేయిస్తానని భయభ్రాంతులకు గురి చేశారని వారు ఆరోపించారు. ఎన్నికల హాల్‌లో ఇతర ఉన్నతాధికారులు సైతం వచ్చి తమను భయపెట్టారని బలవంతంగా మాతో సంతకాలు చేయించారని ఆరోపించారు. నిబంధలనకు విరుద్దంగా జరిగిన ఉప సర్పంచ్‌ ఎన్నికలను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్‌కు, అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఉన్నతాధికారులు వెంటనే ఉపసర్పంచ్‌ ఎన్నికలపై పూర్తి విచారణ జరిపి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో వార్డు సభ్యులు వడ్లూరి మొండి, సంధ్యారాని, షాహిద్‌, వసాకే తానుబాయి పాల్గొన్నార

Updated Date - Dec 15 , 2025 | 12:23 AM