kumaram bheem asifabad- తెగని ‘పంచాయతీ’
ABN , Publish Date - Sep 20 , 2025 | 10:28 PM
గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో... పాత రిజర్వేషన్లనే కొనసాగిస్తారా.. కొత్త విధానం అవలంబిస్తారా.. ఇలా పల్లెల్లో ఎక్కడ చూసినా చర్చ సాగుతోంది. పంచాయతీ పదవుల పై కన్నేసిన ఆశావహులు ఓ వైపు రిజర్వేషన్ కలిసోస్తుందో లేదోనని ఆందోళన పడుతూనే వర్తించక పోతే ఏం చేయాలోనని ప్రస్తుతం తర్చన భర్జన పడుతున్నారు.
- రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఆందోళన
- జిల్లాలో 3,53,895 మంది ఓటర్లు
ఆసిఫాబాద్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో... పాత రిజర్వేషన్లనే కొనసాగిస్తారా.. కొత్త విధానం అవలంబిస్తారా.. ఇలా పల్లెల్లో ఎక్కడ చూసినా చర్చ సాగుతోంది. పంచాయతీ పదవుల పై కన్నేసిన ఆశావహులు ఓ వైపు రిజర్వేషన్ కలిసోస్తుందో లేదోనని ఆందోళన పడుతూనే వర్తించక పోతే ఏం చేయాలోనని ప్రస్తుతం తర్చన భర్జన పడుతున్నారు. కొందరు ఆసక్తిగల నేతలు తమ అనుచరగణంతో ఎన్నికలపై సమాలోచనలు జరుపుతున్నారు. మాజీ ప్రజాప్రతినిధులు సైతం తమ హయాంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు రావాల్సి ఉన్నా... వచ్చే ఎన్నికల్లో తమ ఉనికి చాటు కునేందుకు అవసరమైన వ్యూహాలు రచిస్తున్నారు.
- గత ప్రభుత్వం..
బీఆర్‌ఎస్ ప్రభుత్వం పంచాయతీ రిజర్వేషన్లు పదేళ్ల పాటు అమల్లో ఉండేలా గత ఎన్నికల సమయంలోనే చట్టం రూపొందించింది. ఆ చట్టం ప్రకారం పాత రిజర్వేషన్లనే కొనసాగించాల్సి ఉంటుంది. కానీ ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని సర్కార్ కొత్త విధానం అమలు చేసి తమ మార్కు చూపె ట్టుకునే అభిప్రాయాలున్నాయి. అదే జరిగితే పాత రిజర్వేషన్ల చట్టాన్ని రద్దు చేసి కొత్తది రూపొందిం చాల్సి ఉంటుంది. అందుకు ఏ పద్ధతులను అమలు చేస్తారోననే ఉత్కంఠ ఆశావహుల్లో నెలకొంది. రిజర్వేషన్ల అమలు, పంచాయతీ ఎన్నికల నిర్వహ ణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వక పోవడం ఆందో ళనకు గురి చేస్తోంది.
ఓటరు జాబితా తయారీ..
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండేలా ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికార యంత్రాంగం ఓటరు తుది జాబితా తయారీ పూర్తి చేసింది. ఒకే కుటుంబానికి చెం దిన వారంతా ఒకే పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకునేలా చేశారు. ఫొటో ఓటరు జాబి తా ప్రచురించింది. ఓటరు జాబితాపై అభిప్రాయ సేకరణ కోసం జిల్లా స్థాయి రాజకీయ నాయకుల తో సమావేశాలు నిర్వహించారు. జిల్లా లోని 335 గ్రామ పంచాయతీల్లోని 2,874 పోలింగ్ కేంద్రాల పరిధిలో 3,53,895 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడిం చింది. ఇందులో 1,76,606 మంది పురుషులు, 1,77,269 మంది మహిళలు ఉన్నారు,
మండలాల వారీగా పంచాయతీ ఓటర్లు..
మండలం పురుషులు స్త్రీలు ఇతరులు మొత్తం
ఆసిఫాబాద్ 15,039 15,276 0 30,315
బెజ్జూరు 11,685 12047 2 23,734
చింతలమానేపల్లి 12,118 11,837 0 23,955
దహెగాం 11,014 11,077 1 22,092
జైనూరు 11,936 12,427 0 24,363
కాగజ్‌నగర్ 22,857 22,383 2 45,242
కెరమెరి 12,145 11,880 1 24,026
కౌటాల 13,796 13,560 1 27,357
లింగాపూర్ 5,103 5,479 1 10,583
పెంచికలపేట 6,218 6,084 0 12,302
రెబ్బెన 14,523 14,201 0 28,724
సిర్పూర్(టి) 11,016 11,163 3 22,182
సిర్పూర్(యూ) 5,835 6,440 2 12,277
తిర్యాణి 8,863 9,281 4 18,148
వాంకిడి 14,458 14,134 3 28,595