Share News

నిజమైన దేశభక్తులు కమ్యూనిస్టులే

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:34 PM

నిజమైన దేశభక్తులు కమ్యూనిస్టులేనని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్‌ రెడ్డి అన్నారు. కుమ్రంభీం-ఆసిఫాబాద్‌ జిల్లా జోడేఘాట్‌లో ప్రారంభమైన బస్‌ జాత ఆదివారం సాయంత్రం శ్రీరాంపూర్‌ బస్టాండ్‌కు చేరు కుంది.

నిజమైన దేశభక్తులు కమ్యూనిస్టులే
సమావేశంలో మాట్లాడుతున్న చాడ వెంకటరెడ్డి

- వందేళ్ల ఉత్సవాలను విజయవంతం చేయండి

- సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్‌ రెడ్డి

శ్రీరాంపూర్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : నిజమైన దేశభక్తులు కమ్యూనిస్టులేనని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్‌ రెడ్డి అన్నారు. కుమ్రంభీం-ఆసిఫాబాద్‌ జిల్లా జోడేఘాట్‌లో ప్రారంభమైన బస్‌ జాత ఆదివారం సాయంత్రం శ్రీరాంపూర్‌ బస్టాండ్‌కు చేరు కుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొద్ది మంది ఆస్తులు కూడబెట్టుకునేదుకు నరేంద్ర మోదీ సహకరిస్తున్నారని అన్నారు. ఆ యన ప్రజలపక్షం కాదని, సంపన్నుల పక్షమని ఆరోపించారు. అధి కారం లేకపోయినా ప్రజల కోసం పనిచేసేది తమ పార్టీ కార్యకర్తలే నన్నారు. వందేళ్లుగా ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా సీపీఐ నిలదొక్కు కుందన్నారు. అధికారం లేకపోతే నిలకడగా నిలబడలేని పార్టీలు ఉ న్న ఈరోజుల్లో తాము ఏనాడు అధికారం కోసం వెంపర్లాడలేదని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలకు పి. నర్సయ్య ఎన్నో సేవలందిం చారని కొనియాడారు. సీపీఐ వందేళ్ల ఉత్సవాల బహిరంగ సభ డి సెంబర్‌ 26వ తేదీన ఖమ్మంలో జరుగనుందని, అన్ని వర్గాల ప్రజలు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస రావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్‌, ప్రజానాట్య మండలి సభ్యుడు పల్లె నరసింహా, డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనిల్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, మేకల దాసు, జోగుల మల్లయ్య, కారుకూరి నగేష్‌, లింగం రవి, బాజీసైదా, మిరియాల రాజేశ్వర్‌ రా వు, పూజారి రామన్న, కొత్తపల్లి మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2025 | 11:34 PM