kumaram bheem asifabad- పులుల లెక్క తేలుస్తారు
ABN , Publish Date - Nov 09 , 2025 | 10:42 PM
దేశవ్యాప్తం గా అటవీ శాఖ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్- 2026 చేపట్టనుంది. ఇందుకోసం గత నెలలో కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రేంజ్, సెక్షన్, బీట్‌స్థాయి అధికారులకు శిక్షణ సైతం ఇవ్వడం జరిగింది. వన్యప్రాణుల గణన ఎలా చేయాలో నేర్పించారు
- వారం పాటు నిర్వహించేందుకు చర్యలు
- ఇప్పటికే అటవీశాఖ అధికారులకు శిక్షణ పూర్తి
బెజ్జూరు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తం గా అటవీ శాఖ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్- 2026 చేపట్టనుంది. ఇందుకోసం గత నెలలో కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రేంజ్, సెక్షన్, బీట్‌స్థాయి అధికారులకు శిక్షణ సైతం ఇవ్వడం జరిగింది. వన్యప్రాణుల గణన ఎలా చేయాలో నేర్పించారు. ఒకబీట్ పరిదిలో బీట్‌స్థాయి అధికారితో పాటు మరో ఇద్దరు కలిసి రోజుకు అయిదు కిలోమీటర్ల చొప్పున మూడు రోజులలో 15 కిలోమీటర్లలో పర్యటించి కెమెరాల ఆధారంగా పులుల పాదముద్రలు, పెంటికలు, తదితర ఆనవాళ్లను సేకరించనున్నారు. అటవీ శాఖ సిబ్బంది కొరత కారణంగా వలంటీర్లను సైతం తీసుకోనున్నారు. అటవీ శాఖకు సహకరిస్తున్న ఎన్జీవోలను భాగస్వాములను చేయనున్నారు. అడవులు, చట్టాలపై అవగాహన కలిగి, నిబంధనలు పాటించే నిరుద్యోగ యువతను ఎంపిక చేయనున్నా రు. ఆన్‌లైన్ ద్వారా అవకాశం కల్పించనున్నారు. ఎంపిక చేసిన సిబ్బందికి శిక్షణ అనంతరం ఈ నెల 20నుంచి చేపట్టనున్న గణనలో భాగస్వాములను చేయనున్నారు.
- యాప్‌లో నమోదు..
అటవీ శాఖ సిబ్బంది మొబైల్‌లో యాప్ ద్వారా నమోదు చేస్తారు. జిల్లాలోని వివిద అటవీ ప్రాంతాల్లో పెద్ద పులులు, చిరుతలు తరచూ తిరుగుతూ ఉంటా యి. మహారాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతం నుంచి తరచూ జిల్లా అడవుల్లోకి పెద్ద పులులు ప్రవేశించి అనువైన స్థావరం కోసం వెతుక్కుంటాయి. ప్రస్తుతం పులుల మేటింగ్ సీజన్ కావడంతో ఆడపులుల కోసం మగ పులులు వెతుక్కుంటూ అడవుల్లోకి ప్రవేశిస్తార ుు. ప్రతిరోజు 2నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో అటవీ ప్రాంతాల్లో ఉన్న బాటల వెంట తిరుగుతారు. చిరుతలతో పాటు ఇతర జంతువులు బాటల వెంట వెళ్తాయని అధికారులు తెలిపారు.
- లెక్కింపు ఇలా..
చిరుతలు, ఇతర వన్యప్రాణుల విసర్జనలు, పాదముద్రలు వంటి వాటితో లెక్కిస్తా రు. అలాగే చిరుతలు చెట్లను గీరుతుంటాయి. దాని ప్రకారం కూడా గుర్తు పట్టేందుకు వీలుంటుంది. అటవీ ప్రాంతాల్లో కెమెరాలను సైతం బిగించనునన్నారు. అయితే జిల్లాలో అటవీ బీట్ అధికారుల పోస్టులు చా లావరకు ఖాళీగా ఉన్నాయి, దీంతో గణన చేసేందుకు వలంటీర్లను తీసుకునేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి గణన నిర్వహిస్తారు. జిల్ల్లాలో ఈ నెల 20నుంచి గణన కొన సాగనుంది. మూడు రోజుల పాటు మాంసాహార జంతువులైన చిరుతలు, ఎలు గుబంట్లు, నక్కలు, తోడేళ్లను లెక్కిస్తారు. రెండు, మూడు రోజుల విరా మం తర్వాత శాఖాహార జంతువులను లెక్కిస్తారు.
- ఉదయం వేళలోనే..
ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచి 8గంటల వరకు మాత్రమే గణన చేపట్టను న్నారు. వాస్తవానికి వన్యప్రాణులు తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలోనే మేల్కొం టాయి. ఉదయం 8,9గంటల నుంచే ఆహారం కోసం వేట ప్రారంభిస్తాయి. అందువల్ల ఆ సమయంలోనే గణన చేపట్టే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 11రేంజ్‌లు, సెక్షన్లు 54, బీట్లు 243ఉండగా, 2.44లక్షల హెక్టార్లు అటవీ విస్తీర్ణం నెలకొని ఉంది. జిల్లాలో బీట్ అధికారుల పోస్టులు మరో 50శాతం మేర ఖాళీలు ఉన్నాయి. సెక్షన్లు ఒకటి, రెండు మినహా దాదాపు భర్తీ అయ్యాయి.
సిబ్బందికి శిక్షణ ఇచ్చాం..
- నీరజ్‌కుమార్ టిబ్రేవాల్, జిల్లా అటవీ అధికారి
వన్యప్రాణుల గణన కోసం ఇప్పటికే జిల్లాలోని అటవీశాఖ సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. గతంలో చాలా మందికి లెక్కించిన అనుభవం కూడా ఉంది. ఎక్కడా కూడా పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటాం. ప్రతీ నాలుగేళ్లకు నిర్వహించే వన్యప్రాణుల గణనలో పులులతో పాటు ఇతర జంతువులను కూడా లెక్కిస్తాం. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నాం.