Share News

నిర్ణీత సమయంలో మూడవ యూనిట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Aug 12 , 2025 | 11:20 PM

వైద్య సిబ్బంది నిర్ణీత సమయంలో మూడవ యూనిట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయా లని సింగరేణి డైరెక్టర్‌ (ఈఅండ్‌ఎం) సత్యనారాయ ణరావు పేర్కొన్నారు. మంగళవారం జైపూర్‌లోని ఎస్టీపీపీలో ఆయన పర్యటించారు. ప్రాణహిత గెస్ట్‌ హౌజ్‌లో అధికారులతో స మావేశం నిర్వహించారు. ప్లాంట్‌ పనుల గురించి అధికారు లను అడిగి తెలుసుకున్నారు.

నిర్ణీత సమయంలో మూడవ యూనిట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలి
అధికారులతో మాట్లాడుతున్న సింగరేణి డైరెక్టర్‌ సత్యనారాయణరావు

జైపూర్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : వైద్య సిబ్బంది నిర్ణీత సమయంలో మూడవ యూనిట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయా లని సింగరేణి డైరెక్టర్‌ (ఈఅండ్‌ఎం) సత్యనారాయ ణరావు పేర్కొన్నారు. మంగళవారం జైపూర్‌లోని ఎస్టీపీపీలో ఆయన పర్యటించారు. ప్రాణహిత గెస్ట్‌ హౌజ్‌లో అధికారులతో స మావేశం నిర్వహించారు. ప్లాంట్‌ పనుల గురించి అధికారు లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్లాంటును సంద ర్శించి ప్లాంటు పనితీరును, విద్యుత్‌ ఉత్పత్తి ఉత్పాదకత గురించి అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్‌లో మంచి పీఎల్‌ ఎఫ్‌ సాధించాలన్నారు. ఇథనాల్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారుల కు సూచించారు. సీఎస్‌ఆర్‌ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకుని పెండింగ్‌లో ఉన్నపనులను త్వరగా పూ ర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి ప్లాంట్‌ ప రిసరాల్లో సీబీఎస్‌ఈ పాఠశాలను ప్రారంభించేలా ప్రణాళి కలు తయారు చేయాలన్నారు. ప్లాంట్‌ అభివృద్ధి కొరకు ప్ర తి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, హెచ్‌వోడీ విశ్వనాధరాజు, జీఎం శ్రీనివాసులు, అధికారులు నర్సింహారావు, మురళీధర్‌, మదన్‌ మోహన్‌, శ్రీనివాస్‌, సముద్రాల శ్రీనివాస్‌, అజాజుల్లాఖాన్‌, కిరణ్‌బాబులు పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2025 | 11:20 PM