Share News

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మరువలేనిది

ABN , Publish Date - Sep 11 , 2025 | 11:31 PM

ప్రపంచ పోరాట చరిత్రలో తెలంగాణ సాయుధ రై తాంగ పోరాటం సువర్ణ అక్షరాలతో లిఖించిందని, అమరుల త్యాగాలు మరువలేనివని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు ఎం బాలనర్సింహ అన్నారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మరువలేనిది
మన్ననూరులో సాయుధ రైతాంగ పోరాట యోధులకు నివాళులర్పిస్తున్న సీపీఐ నాయకులు

- సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలనర్సింహ

మన్ననూర్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ప్రపంచ పోరాట చరిత్రలో తెలంగాణ సాయుధ రై తాంగ పోరాటం సువర్ణ అక్షరాలతో లిఖించిందని, అమరుల త్యాగాలు మరువలేనివని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు ఎం బాలనర్సింహ అన్నారు. అ మ్రాబాద్‌ మండలం మన్ననూరు గ్రామంలో తె లంగాణ పోరాట యోధుల సంస్మరణ వారోత్స వాల ప్రారంభంలో భాగంగా గురువారం క మ్యూనిస్టు రాములు స్తూపం వద్ద జెండా ఆవి ష్కరణ చేశారు. అమరులైన సాయుధ పోరాట యోధులకు ఘనంగా నివాళులర్పించారు. ఆయ న మాట్లాడుతూ సెప్టెంబరు 17ను తెలంగాణ సాయుధ పోరాట దినంగా అధికారికంగా నిర్వ హిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా అమలు చేయడం లేదన్నారు. ఈ నెల 17 వరకు జిల్లా వ్యాప్తంగా వారోత్సవాలను సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎండీ ఫయాజ్‌, రాష్ట్ర నాయకులు కేశవులుగౌడ్‌, విజయ, నియోజ వర్గ కార్యదర్శి పెర్ముల గోపాల్‌, నాయకులు కృ ష్ణాజీ, శంకర్‌గౌడ్‌, రవీందర్‌, చంద్రయ్య యాద వ్‌, నర్సింహ, వెంకటస్వామి, విష్ణు, లక్ష్మీపతి, మధు, సలేశ్వరం పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2025 | 11:31 PM