Share News

టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - May 13 , 2025 | 11:17 PM

జిల్లాలో చేపట్టిన టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ హరీశ్‌రాజ్‌ అన్నారు. నస్పూర్‌లోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో మంగళవారం ప్రోగ్రాం అఽధికారుల, వైద్యాధికారులు ఎంఎల్‌హెచ్‌పీ, సూపర్‌వైజర్లు, టీబీ నియంత్రణ అధికా రులు సిబ్బందికి అవగాహన కార్యక్రమం జరిగింది.

టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ పకడ్బందీగా నిర్వహించాలి
మాట్లాడుతున్న జిల్లా వైద్యాఽధికారి హరీశ్‌రాజ్‌

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ హరీశ్‌రాజ్‌

నస్పూర్‌, మే 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో చేపట్టిన టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ హరీశ్‌రాజ్‌ అన్నారు. నస్పూర్‌లోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో మంగళవారం ప్రోగ్రాం అఽధికారుల, వైద్యాధికారులు ఎంఎల్‌హెచ్‌పీ, సూపర్‌వైజర్లు, టీబీ నియంత్రణ అధికా రులు సిబ్బందికి అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్‌ రాజ్‌ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 19 నుంచి టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని వంద రోజుల పాటు కొనసాగుతుందన్నా రు. టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా తొందరగా వ్యాధిని గుర్తించడం సరైన చికిత్స అందించడం ప్రజలలో మధుమేహం, హెచ్‌ఐవీ, క్యాన్సర్‌, గుండె, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వ్యాధులను గు ర్తించి పరీక్షలు చేయిస్తామన్నారు. జిల్లాలో వందశాతం ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. గ్రామాల్లో ఆశ, ఆరోగ్య కార్యకర్తలు ఎంఎల్‌హెచ్‌పీల ద్వారా ప్రభావిత వ్యాధి గ్రస్తులను గుర్తించి వారి గ్రామంలోనే పరీక్ష లు చేయిస్తామన్నారు. ఇందుకుగాను రెండు వాహనాలను కేటాయించి ఎక్స్‌రే, పరికరాలు సాంకేతిక నిపుణులను కూడ అందుబాటులో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్‌ సుధాకర్‌ నాయక్‌, డాక్టర్‌ అనిత, డాక్టర్‌ ప్రసాద్‌, డాక్టర్‌ కృపభాయి, డాక్టర్‌ అనిల్‌, జిల్లాలోని 150 మంది వైద్యాధికారులు, ఎంఎల్‌హెచ్‌పీలు పర్యవేక్షకులు జిల్లా టీబీ మేనేజర్‌ సురేందర్‌, మాస్‌ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2025 | 11:17 PM