Share News

kumaram bheem asifabad- ఉప్పొంగిన పెన్‌గంగ

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:05 AM

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా సిర్పూర్‌(టి) మండలం సరిహద్దులో ఉన్న పెన్‌గంగ బుధవారం ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో వరదల నేపథ్యంలో అక్కడి ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో పెన్‌గంగ ఉగ్రరూపం దాల్చింది. దీంతో మండల సరిహద్దులోని అంతరాష్ట్ర పోడ్సా వంతెనను ఆనుకుని, హుడ్కిలి లో లెవల్‌ వంతెనపై బ్యాక్‌ వాటర్‌ ప్రవహించడంతో రాక పోకలు నిలిచి పోయాయి.

kumaram bheem asifabad- ఉప్పొంగిన పెన్‌గంగ
సిర్పూర్‌(టి) సరిహద్దున పోడ్సా వంతెనకు ఆనుకుని ప్రవహిస్తున్న పెన్‌గంగ

సిర్పూర్‌(టి), సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా సిర్పూర్‌(టి) మండలం సరిహద్దులో ఉన్న పెన్‌గంగ బుధవారం ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో వరదల నేపథ్యంలో అక్కడి ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో పెన్‌గంగ ఉగ్రరూపం దాల్చింది. దీంతో మండల సరిహద్దులోని అంతరాష్ట్ర పోడ్సా వంతెనను ఆనుకుని, హుడ్కిలి లో లెవల్‌ వంతెనపై బ్యాక్‌ వాటర్‌ ప్రవహించడంతో రాక పోకలు నిలిచి పోయాయి. ఈ నేపథ్యంలో సిర్పూర్‌(టి) మండలం హుడ్కిలికి గ్రామానికి చెందిన ముగ్గురు నిండు గర్భిణులు ఆత్రం మమత, టేకం ప్రతిక్ష, కిర్మురె సబ్బంగిలు ఉండడంతో విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ రహీముద్దీన్‌ ముందు జాగ్రత్తగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిని హుడ్కిలి గ్రామం నుంచి ట్రాక్టర్‌పై వాగు దాటించి సిర్పూర్‌(టి) మండలంలోని నవేగాం సబ్‌ సెంటర్‌ అంబులెన్స్‌లో తరలించారు. ఈ ముగ్గురికి ఈ నెల 16, 22, 25తేదీల్లో కాన్ఫు సమయం ఉందని వైద్య సిబ్బంది తెలిపారు.. గర్భిణీలకు ప్రస్తుతం సబ్‌ సెంటర్లలో వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఎస్సై కమలాకర్‌, ఎంపీడీఓ సత్యనారాయణలను రెండు చోట్ల బందో బస్తు ఏర్పాటు చేసి సాయంత్రం 6 తరువాత ఎవరు కూడా వాగు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు.

కౌటాల, (ఆంధ్రజ్యోతి): ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు అక్కడి ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో కౌటాల మండల సరిహద్దున గల ప్రాణహిత ఉప్పొంగి ప్రవహిస్తున్నది. బుధవారం మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద పుష్కర ఘాట్‌లకు ఆనుకుని ప్రవహించింది. ప్రాణహిత ఉధృతంగా ప్రవహించడంతో సమీప గ్రామాల ప్రజలు ఉధృతిని చూడడానికి తరలి వస్తున్నారు.

Updated Date - Sep 04 , 2025 | 12:05 AM