కాళేశ్వరం ప్రాజెక్టు కథ ముగిసింది
ABN , Publish Date - Aug 22 , 2025 | 11:43 PM
మాజీ సీఎం కేసీఆర్ మానస పుత్రిక పేరుతో నిర్మాణం చేపట్టిన కాళేశ్వరం పాజ్రెక్టు కథ ము గిసిందని ఆ ప్రాజెక్టు నీటి అవసరాలు లేకుండానే 70శాతానికిపైగా పంట పండిస్తున్నారని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనులశాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి అన్నారు
ఓటు దొంగతనం అన్ని పార్టీలు స్పందించాలి
మంత్రి వివేక్ వెంకటస్వామి
మందమర్రిటౌన్, ఆగస్టు22 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్ మానస పుత్రిక పేరుతో నిర్మాణం చేపట్టిన కాళేశ్వరం పాజ్రెక్టు కథ ము గిసిందని ఆ ప్రాజెక్టు నీటి అవసరాలు లేకుండానే 70శాతానికిపైగా పంట పండిస్తున్నారని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనులశాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల కోట్ల కుంభకోణం జరిగింది వాస్తవం కాదా అని ఇటీవల ఆప్రాజెక్టుకు సం బంధించి కోర్టు నివేదిక ప్రభుత్వానికి అందించారని తెలిపారు. శుక్రవారం మందమర్రిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిఉన్న ప్రాజెక్టును సొంత నిర్ణయాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ ప్రాజెక్టును కాళేశ్వరం వద్ద కట్టారని పేర్కొన్నా రు. ఆప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన మూడేళ్లలోనే పెద్ద పగుళ్లు తేలి పనికి రాకుండా పోయే స్థాయికి చేరిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం తరువాత బ్యాక్ వాటర్‌తో పాటు చెన్నూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పంట పొలాలు మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలి పారు. ఇటీవల కురిసిన వర్షాలకు నియోజకవర్గంలో 500 ఎకరాలకు పైగా పంట నష్టపోయారని వారిని ఆదుకుంటామని తెలిపారు. కేం ద్రంలో యూరియా సరఫరా చేస్తే సక్రమంగా అందరికి అందించే చర్య లు చేపడుతామన్నారు. దేశ వ్యాప్తంగా ఓట్ల దొంగతనానికి సంబం ధించి తమ నేత రాహుల్‌గాంధీ చేపట్టిన నిర్ణయాన్ని అందరూ అభినం దిస్తున్నారని తెలిపారు. దీనిపై అన్ని పార్టీలు కూడ స్పందించాలన్నారు. రాష్ట్రంలో రైతాంగానికి యూరియా అందజేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీక్రిష్ణ కృషి చేస్తున్నారని తెలిపారు. పని చేసే ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ప్రజలు నమ్మరనే విషయాలు ప్రతిపక్షాలు గుర్తిస్తే బాగుంటుందని తెలిపారు.
ఫమంత్రి వివేక్ వెంకటస్వామిని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు శుక్రవారం కలిశారు. ఓదెలు ఆరోగ్య పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు.