Share News

kumaram bheem asifabad- ప్రాజెక్టుల కథ.. తీరని వెత

ABN , Publish Date - Nov 28 , 2025 | 10:19 PM

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పంట పొలా లకు సాగునీటిని అందించే ప్రాజెక్టుల నిర్మాణంలో అంతులేని జాప్యం తీరని వెతగా మారింది. దీంతో జిల్లా రైతాంగానికి వర్షాధారమే సాగుకు దిక్కవుతోంది. ఏళ్లుగా ప్రధాన ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండడంతో సాగులో పెద్దగా మార్పు జరగడం లేదు. సరైన సాగునీటి వసతి లేక వేలాది ఎకరాల భూమి నిరుపయోగంగా మారుతోంది. గత్యంతరం లేక ఆరుతడి పంటలనే రైతులు సాగు చేస్తున్నారు.

kumaram bheem asifabad- ప్రాజెక్టుల కథ.. తీరని వెత
లోగో

- సాగునీరు అందక రైతుల అవస్థలు

- నిర్మాణాల్లో అంతులేని జాప్యం

- పట్టించుకోని ప్రభుత్వం

ఆసిఫాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పంట పొలా లకు సాగునీటిని అందించే ప్రాజెక్టుల నిర్మాణంలో అంతులేని జాప్యం తీరని వెతగా మారింది. దీంతో జిల్లా రైతాంగానికి వర్షాధారమే సాగుకు దిక్కవుతోంది. ఏళ్లుగా ప్రధాన ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండడంతో సాగులో పెద్దగా మార్పు జరగడం లేదు. సరైన సాగునీటి వసతి లేక వేలాది ఎకరాల భూమి నిరుపయోగంగా మారుతోంది. గత్యంతరం లేక ఆరుతడి పంటలనే రైతులు సాగు చేస్తున్నారు. చివరికి వానపడతే పంట లేకుంటే లేదు అన్న చందంగా రైతులు పరిస్థితి నెలకొన్నది. అన్నదాతలు పూర్తిగా వర్షాధార పంటలపై ఆధార పడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రాజెక్టు పూర్తై సక్రమంగా నీరందిస్తే తప్ప సాగు పండుగలా మారే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ అవి పెండిం గ్‌లోనే ఉన్నాయి. ప్రధానంగా కుమరం భీం ప్రాజెక్టు, జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి కావడం లేదు. జిల్లాలోని వట్టివాగు ప్రాజెక్టు కాలువలు మరమ్మతులకు నోచుకోవడం లేదు.

- పూర్తి కాని కుమరం భీం ప్రాజెక్టు..

జిల్లాలో ప్రధానమైన కుమరం భీం ప్రాజెక్టు కూడా ఏళ్లుగా రైతులకు పూర్తి స్థాయిలో సాగునీ రందించడం లేదు. పది టీఎంసీల సామర్థ్యంతో సుమారు రూ.600 కోట్లకు పైగా అంచనాలతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు లక్ష్యంలో సగం కూడా నీరందించడం లేదు. కుడి ప్రధాన కాలువ ద్వారా ఆసిఫాబాద్‌ మండల పరిధిలో ఆరు వేల ఎకరాలు, ప్రధాన ఎడమ కాలువ ద్వారా ఆసిఫాబాద్‌తో పా టు కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి) మండలాల్లోని 45, 500 ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రాజె క్టును రూపొందించారు. ప్రాజెక్టు ప్రధాన నిర్మాణం పూర్తై ఏళ్లు గడుస్తున్నా కాలువల పనులు పూర్తి కాకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది.

- దయనీయ స్థితిలో వట్టివాగు..

ఆసిఫాబాద్‌ మండలం వట్టివాగు నీటిని స్థానిక పొలాలకు అందించాలనే ఉద్దేశ్యంతో 1998లో 24,500 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కుడి కాలువ ద్వారా 21,800 ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 2,700 ఎకరాల ఆయ కట్టు లక్ష్యంగా ప్రతిపాదించారు. కాలువలు ప్రాజెక్టు నిర్మాణం నుంచి ఆధునీకరణకు నోచుకో వడం లేదు. దీనికి తోడు ఇప్పటికే కాలువలు మొత్తం దెబ్బతిన్నాయి. లైనింగ్‌ కోల్పోయి చెట్లు ఏపుగా పెరిగి అధ్వానంగా మారాయి. చాలా చోట్ల కాలువలు ధ్వంసమై నామరూపాలు లేకుండా పోయాయి. దీంతో ఆసిఫాబాద్‌, రెబ్బెన మండలాల పరిధిలోని ఆయకట్టు రైతులకు సాగునీరు అందించే స్థితిలో లేదు. అధి కారులు ఆధునీకరణ పనుల కోసం ప్రతిపాదనలను పంపినప్పటికీ సరిపడా నిధులు విడుదల కాకపోవడంతో పనులు ముందకు సాగడం లేదు.

- పెద్దవాగుపై నిర్మించిన..

కాగజ్‌నగర్‌ మండలంలోని పెద్దవాగుపై నిర్మించి న జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు పనులు ఇంకా కొనసా గుతూనే ఉన్నాయి. కాగజ్‌నగర్‌, దహెగాం మండలాల పరిధి 15 వేల ఎకరాలకు సాగునీరం దించే లక్ష్యంతో ప్రాజెక్టు నిర్మాణ పనులను చేప ట్టినప్పటికీ నత్తనడకన కొనసాగుతున్నాయి. భూ సేకరణ, తదితర సమస్యలతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రాజెక్టు నిర్మాణం పనుల్లో జాప్యంతో ఆయకట్టుదారులకు సాగునీరు అందని పరిస్థితి నెలకొన్నది. ప్రాజెక్టు నిర్మాణం చేపడితే తమ భూములు పంట పొలాలుగా మారుతాయని ఆశించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. ప్రభు త్వం స్పందించి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయా లని రైతులు కోరుతున్నారు.

Updated Date - Nov 28 , 2025 | 10:19 PM