కబ్జాతో ఆక్రమణదారుల దర్జా
ABN , Publish Date - May 05 , 2025 | 11:26 PM
ఊరందరకి ఊపిరి పోసిన చెరువు అది. ఒకప్పుడు మత్య్సకారుల జీవితాల్లో వెలుగు నింపింది ఆ చెరువు.
కబ్జాతో ఆక్రమణదారుల దర్జా
నర్లకుంట చెరువును సాగు భూమిగా మార్చినా పట్టించుకోని అధికారులు
పంట భూములు బీళ్లుగా మారుతున్నాయని రైతులు ఆవేదన
త్రిపురారం ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): ఊరందరకి ఊపిరి పోసిన చెరువు అది. ఒకప్పుడు మత్య్సకారుల జీవితాల్లో వెలుగు నింపింది ఆ చెరువు. అలాంటి నల్లగొండ జిల్లా త్రిపురారం మండ లంలోని పెద్దదేవులపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నర్లకంటిగూడెంలో ఉన్న నర్ల్లకుంట చెరువు కజ్జా కోరల్లో చిక్కు కుని విలవిలలాడుతోంది. ఈ చెరువు 58ఎకరాల్లో ఉండగా 38ఎకరాలు కబ్జాకు గురైంది. ఈ ప్రాంతంలో ఎకరా భూమి విలువ రూ.25లక్షలు ఉంది. ఈ లెక్కన రూ.9.50కోట్ల విలువైన చెరువు భూమి కబ్జాకు గురైనా అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు తెలిపారు. ఈ చెరువు కింద సుమారు 500 ఎకరాలు ఆయకట్టు ఉంది.. చెరువు ఆక్రమణకు గురైనందున సాగు నీటి లభ్యత కష్టంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరు బావులు ఏర్పాటు చేసుకున్నా భూగర్బజలాలు అడుగంటి, పంట భూములు బీళ్లుగా మారాయని రైతులు వాపోతున్నారు. ఏళ్ల తరబడి మత్య్సకారులు ఈ చెరువుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. చెరువు అన్యాక్రాంతం కావడంతో వారి బతుకులు భారంగా మారాయి.
గత ఏడాది ఏప్రిల్‌లో చెరువు మధ్యలో ఎక్స్ వేటర్‌తో మట్టి తీసి ట్రాక్టర్లతో చదును చేస్తుండగా మత్స్యకారులు అడ్టుకుని, అదే రోజు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.. అప్పటి కలెక్టర్‌గా ఉన్న దాసరి హరిచందన చెరువు ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని హద్దులు ఏర్పాటు చేయాలని ఆదేశించినా నేటికీ పురోగతి లేదు..
కలెక్టర్ ఆదేశాలతో చెరువు ఆక్రమణపై రెవెన్యూ, ఎనఎస్పీ అధికారులు విచారణ చేపట్టారు. ఆక్రమణదారులపై ఎనఎస్పీ అధికారులు మాడ్గులపల్లి పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా ఆక్రమణదారుల వాహనాలు వదిలివేశారు. చెరువులో పోసిన మట్టిని ఆక్రమణదారులు చదును చేయించి, ఖరీఫ్, యాసంగిలో వరిని సాగు చేశారు. అయినా ఓ ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు. మత్స్యకారులు పలు మార్లు సార్లు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఫలితం లేకుండా పోయింది.కబ్జాదారుల ఆగడాలకు అడ్డేలేకుండా పోయింది.
ఏడాది కాలంగా కాలయాపన
చెరువు హద్దులు ఏర్పాటు చేయడంలో ఎనఎస్పీ అధికారులు ఏడాది కాలంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నెల రోజుల్లో చెరువుకు హద్దులు ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చినా ఇప్పటికీ అతీగతీ లేకుండా పోయిందని మత్స్యకారులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువును పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఉపాధి కోల్పోయాం
ఈ చెరువుపై ఆధార పడి జీవించే వాళ్లం. చెరువు చుట్టూ ఉన్న రైతులు ఆక్రమించారు. చెరువులో ముప్పాతిక భాగంలో మట్టి పోసి చదును చేసి పంటలు పండించుకుంటున్నారు. సంఘం తరపున కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులకు ఎన్నో సార్లు కలిసి సమస్యను వివరించాం. ఇప్పటివరకు ఆక్రమణలను తొలగించలేదు. అధికారులు స్పం దించి చెరువుకు హద్దులు ఏర్పాటు చేయాలి.
ఫ అంబటి సైదులు, మత్స్యకారుల సంఘం కార్యదర్శి, పెద్దదేవులపల్లి
తహసీల్దార్‌కు లేఖ రాశాం
నర్లకుంట చెరువును సర్వే చేయాలని వారం రోజుల క్రితం తహసీల్దార్‌కు లేఖ రాశాం. చెరువును పూర్తి స్థాయిలో సర్వే చేసి ఆక్రమణలను తొలగించి హద్దులు ఏర్పాటు చేయిస్తాం..
ఫ కేశవ్, డీఈ, ఎనఎస్పీ