రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలుపర్చాలి
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:18 PM
న్నికల ముందు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిలుపుకోవాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి డి మాండ్ చేశారు.
- జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి
- కల్వకుర్తిలో ఆరు గ్యారెంటీలు అమలుపర్చాలని ర్యాలీ, ధర్నా
కల్వకుర్తి, ఆగస్టు 6 (ఆంధ్ర జ్యోతి) : ఎన్నికల ముందు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిలుపుకోవాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి డి మాండ్ చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు వెంటనే పింఛన్లు పెంచాలని అన్నారు. కల్వకుర్తి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆరు గ్యా రెంటీలను అమలుపర్చాలని భారీ ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్ ఇ బ్రహీంకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఆచారి మాట్లాడుతూ వివిధ వ ర్గాల వారికి ఇస్తున్న పింఛన్‌ను పెంచాలని డి మాండ్ చేశారు. రాజీవ్ యువ వికాసం రు ణాలను వెంటనే అమలుపర్చాలని ఆయన డి మాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌ న్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్, సీనియర్ నాయకులు బండెల రామచంద్రారెడ్డి, హరిప్ర సాద్, నాయకులు కృష్ణగౌడ్, నరేష్, రాఘవేం దర్‌గౌడ్, శేఖర్‌రెడ్డి, నరసింహ, కృష్ణారెడ్డి, రాం భూపాల్‌రెడ్డి, బాబీదేవ్, నాయకులు ఉన్నారు.
ముస్లింలకు 10 శాతం ఇవ్వడం అన్యాయం
తెలకపల్లి : బీసీలకు పూర్తిస్థాయి 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే బీజేపీ మద్దతు ఇస్తుందని, అందులో 10శాతం ముస్లింలకు కేటాయిస్తే ఎట్టి పరిస్థితిల్లోనూ సమర్థించబోమని బీజేపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి కట్టా సుధాకర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికల్లో పూర్తిస్థాయిలో 42 శాతం బీసీ అభ్యర్థులే ఉండాలన్నారు. డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కూడా మతపరమైన రిజర్వే షన్లు ఉండకూడదని అన్నారని గుర్తు చేశారు. రు. అలాంటిది ప్రస్తుత ప్రభుత్వం మత ప్రా తిపదికపై రిజర్వేషన్ కేటాయించాలని చూస్తు న్నదని అన్నారు. నాయకులు చిన్నారెడ్డి, రమణారెడ్డి, బాబు సాగర్, కృష్ణయ్య, శ్రీనివాస్, రాముడు, రమేష్, అంజిరెడ్డి పాల్గొన్నారు.