విద్యార్థులను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:29 PM
ఫీజు రీయింబ ర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు అందక ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల ను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.తారా సింగ్ విమర్శించారు.
- ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.తారాసింగ్
నాగర్‌కర్నూల్ టౌన్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ఫీజు రీయింబ ర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు అందక ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల ను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.తారా సింగ్ విమర్శించారు. శనివారం ఎస్ ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ జూబ్లిహి ల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సినీ కార్మికుల కోసం కార్పొరేట్ స్థాయిలో పాఠశాలను ఏర్పా టు చేసి ఉచిత విద్యను అందిస్తామని హామీలు గుప్పి స్తున్న సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో విద్యా ర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించా రు. పెండింగ్‌లో ఉన్న ఫీజురీఎంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ తక్షణమే ఇవ్వాలని ఆయన కోరా రు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వంశీ, దేవదాస్, భరత్, నాగరాజు, సిద్దు, సురేందర్, విజయ్ పాల్గొన్నారు.