Share News

మోగిన నగారా...

ABN , Publish Date - Sep 30 , 2025 | 12:06 AM

ఎప్పుడె ప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నిక లకు ఎట్టకేలకు మార్గం సుగమం అయింది. స్థానిక సంస్థల ఎన్నికలను మొత్తం ఐదు విడుతల్లో నిర్వహిం చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది.

మోగిన నగారా...

-స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

-మొత్తం ఐదు విడుతల్లో నిర్వహణ

-రెండు విడుతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు

-ఆ తరువాత మూడు విడుతల్లో పంచాయతీ ఎలక్షన్లు

-అక్టోబర్‌ 9న నోటిఫికేషన్‌ విడుదల

-అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభం

-తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్‌

మంచిర్యాల, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఎప్పుడె ప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నిక లకు ఎట్టకేలకు మార్గం సుగమం అయింది. స్థానిక సంస్థల ఎన్నికలను మొత్తం ఐదు విడుతల్లో నిర్వహిం చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. రెండు విడుతల్లో జడ్పీటీసీ, ఎం పీటీసీ ఎన్నికలు జరుగనుండగా, పంచాయతీ ఎన్నిక లను మూడు విడుతలుగా నిర్వహించనున్నారు. వాస్త వానికి లోక్‌సభ ఎలక్షన్లు ముగియగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్ర భుత్వం అధికారంలోకి రావడం, పాలనపై పట్టు సాధిం చేందుకు కొంత సమయం పట్టింది. దీంతో స్థానిక సం స్థల ఎన్నికల నిర్వహణలో సంవత్సరం పాటు జాప్యం జరిగింది. గ్రామ పంచాయతీల పాలన గత సంవత్స రం జనవరిలో ముగియగా, జిల్లా పరిషత్‌, మండల ప రిషత్‌ల పాలక వర్గాల పదవీకాలం జూలైతో ముగి సిం ది. ఏడాది సుధీర్ఘ సమయం దాటిన తరువాత ఎట్టకే లకు మార్గం సుగమం కావడంతో పల్లెల్లో ఎన్నికల సం దడి నెలకొంది. జిల్లాలో మొత్తం 16 మండలాలు ఉండ గా.... జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు కూడా అంతే మొత్తం లో ఉన్నాయి. అలాగే ఎంపీటీసీ స్థానాలు 129 ఉన్నా యి. మొత్తం ఎంపీటీసీ స్థానాలకుగాను బీసీలకు 54, ఎస్సీలకు 33, ఎస్టీలకు 14, జనరల్‌కు 28 కేటాయిం చారు. అలాగే 306 సర్పంచ్‌ స్థానాల్లో బీసీలకు 109, ఎస్సీలకు 81, ఎస్టీలకు 65, జనరల్‌కు 51 స్థానాలను కేటాయించారు. ఎలక్షన్‌ షెడ్యూల్‌ విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ కూడా అమల్లోకి వచ్చింది.

జడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు ఇలా...

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొదట జడ్పీ టీసీ, ఎంపీపీ ఎలక్షన్లు నిర్వహించనున్నారు. ఇందుకు గాను ఇటీవల మండలాల వారీగా అభ్యర్థులకు కేటా యించిన రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు.

స్థానం జడ్పీటీసీ ఎంపీపీ

జన్నారం ఎస్టీ(జనరల్‌) బీసీ(మహిళ)

మందమర్రి ఎస్టీ(మహిళ) ఎస్టీ(మహిళ)

బెల్లంపల్లి ఎస్సీ(మహిళ) ఎస్సీ(మహిళ)

భీమారం ఎస్సీ(జనరల్‌) ఎస్టీ(జనరల్‌)

హాజీపూర్‌ ఎస్సీ(మహిళ) ఎస్సీ(జనరల్‌)

నెన్నెల ఎస్సీ(జనరల్‌) ఎస్సీ(జనరల్‌)

చెన్నూరు బీసీ(మహిళ) బీసీ(మహిళ)

దండేపల్లి బీసీ(జనరల్‌) జనరల్‌(మహిళ)

జైపూర్‌ బీసీ(జనరల్‌) బీసీ(జనరల్‌)

కన్నెపల్లి బీసీ(మహిళ) ఎస్సీ(మహిళ)

కాసిపేట బీసీ(జనరల్‌) బీసీ(మహిళ)

తాండూరు బీసీ(మహిళ) జనరల్‌

వేమనపల్లి బీసీ(జనరల్‌) బీసీ(జనరల్‌)

భీమిని జనరల్‌ జనరల్‌

కోటపల్లి జనరల్‌ బీసీ(జనరల్‌)

లక్షెట్టిపేట జనరల్‌(మహిళ) బీసీ(జనరల్‌)

జిల్లాలో 3.7 లక్షల ఓటర్లు...

పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల్లో తుది ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం జిల్లాలోని 306 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 3,76,669 ఓటర్లు ఉన్నారు. వీరిలో స్త్రీలు 1,91,011 మంది ఉండగా, పురుషులు 1,85,643, ఇతరులు 15 మంది ఉన్నారు.

మండలాల వారీగా ఓటర్ల వివరాలు...

మండలం మొత్తం పురుషులు స్త్రీలు ఇతరులు

బెల్లంపల్లి 23464 11625 11838 01

భీమిని 11529 5844 5684 01

భీమారం 13093 6394 6699 00

చెన్నూర్‌ 26475 13040 13435 00

దండేపల్లి 42101 20486 21614 01

హాజీపూర్‌ 16954 8361 8593 00

జైపూర్‌ 30626 15278 15347 01

జన్నారం 44412 21670 22740 02

కన్నెపల్లి 15490 7614 7875 01

కాసిపేట 26472 13127 13342 03

కోటపల్లి 26990 13320 13668 02

లక్షెట్టిపేట 25227 12261 12966 00

మందమర్రి 11482 5678 5803 01

నెన్నెల 19371 9636 9734 01

తాండూర్‌ 27757 13741 14016 00

వేమనపల్లి 15226 7568 7657 01

మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు...

మొదటి విడుత....

మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ మొ దటి విడుత అక్టోబర్‌ 9వ తేదీన విడుదల కానుండగా, అదే రోజు నామినేషన్లు స్వీకరణ ప్రారంభం, ఓటర్ల జాబితా ప్రదర్శన, 11న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ, 12న నామినేషన్ల పరిశీలన, చెల్లుబాటైన అభ్య ర్థుల జాబితా విడుదల, 13న అప్పీళ్లకు గడువు, 14న అప్పీళ్ల పరిష్కరణ, 15న నామినేషన్ల ఉపసంహరణ గడువు, అభ్యర్థుల తుది జాబితా విడుదల, 23న ఎన్ని కల నిర్వహణ, నవంబరు 11న ఓట్ల లెక్కింపు

రెండో విడత...

అక్టోబర్‌ 13వ తేదీన మండల, జిల్లా పరిషత్‌ ఎన్ని కల నోటిఫికేషన్‌ రెండో విడుత విడుదల కానుండగా, అదే రోజు నామినేషన్లు స్వీకరణ ప్రారంభం, ఓటర్ల జా బితా ప్రదర్శన, 15న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ, 16న నామినేషన (

పరిశీలన, చెల్లుబాటైన అభ్యర్థుల జా బితా విడుదల, 17న అప్పీళ్లకు గడువు, 18న అప్పీళ్ల ప రిష్కరణ, 19న నామినేషన్ల ఉపసంహరణ గడువు, అ భ్యర్థుల తుది జాబితా విడుదల, 27న ఎన్నికల నిర్వ హణ, నవంబరు 11న ఓట్ల లెక్కింపు

గ్రామ పంచాయతీ ఎన్నికలు...

మొదటి విడుత...

మొదటి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికలకుఅక్టోబర్‌ 17వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుండగా, అదే రోజు నామినేషన్లు స్వీకరణ ప్రారంభం కానుంది. ఓటర్ల జాబితా ప్రదర్శిస్తారు. 19న నామినేషన్ల దాఖలు కు చివరి తేదీ, 20న నామినేషన్ల పరిశీలన, చెల్లుబా టైన అభ్యర్థుల జాబితా విడుదల, 21న అప్పీళ్లకు గడు వు, 22న అప్పీళ్ల పరిష్కరణ, 23న నామినేషన్ల ఉప సంహరణ గడువు, అభ్యర్థుల తుది జాబితా విడుదల, 31న ఎన్నికల నిర్వహణతో పాటు అదే రోజు ఓట్ల లెక్కింపు జరపనున్నారు.

రెండో విడుత...

అక్టోబర్‌ 21న రెండో విడుత విడుదల కానుండగా, అదే రోజు నామినేషన్లు స్వీకరణ ప్రారంభం, ఓటర్ల జా బితా ప్రదర్శన, 23న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ, 24న నామినేషన్ల పరిశీలన, చెల్లుబాటైన నామినేషన్ల జాబితా విడుదల, 25న అప్పీళ్లకు గడువు, 26న అప్పీళ్ల పరిష్కరణ, 27న నామినేషన్ల ఉపసంహరణ గడువు, అభ్యర్థుల తుది జాబితా విడుదల, నవంబరు 4వ తేదీన ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు

మూడో విడుత...

అక్టోబర్‌ 25వ తేదీన మూడో విడుత విడుదల కా నుండగా, అదే రోజు నామినేషన్లు స్వీకరణ ప్రారంభం, ఓటర్ల జాబితా ప్రదర్శన, 27న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ, 28న నామినేషన్ల పరిశీలన, చెల్లుబాటైన నామినేషన్ల జాబితా విడుదల, 29న అప్పీళ్లకు గడువు, 30న అప్పీళ్ల పరిష్కరణ, 31న నామినేషన్ల ఉపసంహ రణ గడువు, అభ్యర్థుల తుది జాబితా విడుదల, నవం బరు 8వ తేదీన ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు.

Updated Date - Sep 30 , 2025 | 12:07 AM