Share News

kumaram bheem asifabad- బంద్‌ సంపూర్ణం

ABN , Publish Date - Jul 21 , 2025 | 11:14 PM

జిల్లా వ్యాప్తంగా జీవో 49ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ జేఏసీ ఇచ్చిన బంద్‌ పిలుపు సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. పోలీసులు బంద్‌కు సంబంధించి పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేశారు

kumaram bheem asifabad- బంద్‌ సంపూర్ణం
ఆసిఫాబాద్‌ ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించిన ఆదివాసీ నాయకులు

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా జీవో 49ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ జేఏసీ ఇచ్చిన బంద్‌ పిలుపు సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. పోలీసులు బంద్‌కు సంబంధించి పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుండే వాణిజ్య సముదాయాల యజమానులు స్వచ్చందంగా బంద్‌లో పాల్గోనగా ఆర్టీసీ బస్సులు అరకొరగా నడిచాయి. బస్టాండు ఎదుట ధర్నా నిర్వహించి బస్సులు బయటికి వెళ్లకుండా చూశారు. అనంతరం జిల్లా కేంద్రంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బంద్‌తో రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. బంద్‌ సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌, ఏఎస్పీ చిత్తరంజన్‌ ఆధ్వర్యంలో పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో సీఐ రవీందర్‌ బందో బస్తు ఏర్పాట్లను పరిశీలించారు. రాత్రి నుంచి పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రానికి పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలి రాకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. ఏదీ ఏమైన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు కోవవిజయ్‌, మాలశ్రీ, శ్రీనివాస్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు..

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): గిరిజన సంఘాలిచ్చిన పిలుపు మేరకు కాగజ్‌నగర్‌లో బంద్‌ సక్సెస్‌ అయింది. ఈ సందర్భంగా పట్టణ వ్యాపార సంస్థలన్నీ కూడా స్వచ్చందగా మూసివేసి బంద్‌కు సహకరించాయి. ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయిహరీష్‌ బాబు పట్టణంలో తిరిగారు. వివిధ సంఘాల నాయకులు కూడా ఈ బంద్‌కు పూర్తిగా సహకరించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

చింతలమానేపలి, ్ల(ఆంధ్రజ్యోతి): మండలంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్‌ సంపూర్ణం అయింది. ఈ సందర్భంగా దుకాణాలను బంద్‌ చేయించి శివాజీ విగ్రహం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్‌, శంకర్‌, భీమేష్‌, ఆపూరావు, పనేందర్‌, సాగర్‌, రూపేష్‌, సుధాకర్‌, బీజేపీ నాయకులు రామన్న, అంకులు తదితరులు పాల్గొన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండలంలో ఆదివాసీ సంఘాలు తలపెట్టిన బంద్‌ విజయవంతం అయింది. ఈ కార్యక్రమంలో నాయకులు సకారాం, తిరుపతి, శంకర్‌, రాజు, వెంకటేష్‌, మోహన్‌, రాజారాం, అమృత, తిరుపతి, వశీఖాన్‌, కిషన్‌, గోపాల్‌ పాల్గొన్నారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ సంఘాలు తలపెట్టిన బంద్‌ మండలంలో విజయవంతం అయింది. ఈ సందర్భంగా దుకాణాలు స్వచ్చందంగా బంద్‌ పాటించాయి. ఆయా కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): మండలంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్‌ సంపూర్ణం అయింది. ఈ సందర్భంగా దుకాణాలను బంద్‌ చేయించి శివాజీ విగ్రహం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధుకర్‌, అశోక్‌, సకారాం, మల్లేష్‌, భుజంగరావు, శ్రీనివాస్‌, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(టి), (ఆంధ్రజ్యోతి): మండలంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్‌ సంపూర్ణం అయింది. ఈ సందర్భంగా దుకాణాలను బంద్‌ చేయించి ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్‌, బీజేపీ నాయకులు లావణ్య, షేక్‌చాంద్‌, తదితరులు పాల్గొన్నారు. ఎస్సై కమలాకర్‌ ఆధ్వర్యంలో భారీ బందో బస్తు నిర్వహించారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): జిల్లాలో టైగర్‌ కన్జర్వేషన్‌ రిజర్వ్‌ ఏర్పాటు కోసం తీసుకు వచ్చిన జీవో.49ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ సంఘాలు తుడుం దెబ్బ ఇచిచన బంద్‌ పిలుపు సోమవారం విజయవంతం అయింది. ఉదయకే వాణిజ్య, వ్యాపార సముదాయాలు మూసి ఉంచారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు బందో బస్తు నిర్వహించారు.

తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): మండలంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్‌ సంపూర్ణం అయింది. ఈ సందర్భంగా దుకాణాలను బంద్‌ చేయించి కుమరం భీం విగ్రహం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బంద్‌ మండలంలో సంపూర్ణంగా జరిగింది. ఆయా కార్యక్రమంలో తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు కుమ్ర భీమ్‌రావు, ఉపాధ్యక్షడు ఆత్రం దౌలత్‌రావు నాయకులు పెందోర్‌ నాగోరావు, మడావి శంకర్‌, లచ్చన్న, నగేష్‌, సేడ్మకి దౌలత్‌రావు, ఆత్రం నాగోరావు తదితరులు పాల్గొన్నారు.

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): ఆదివాసీలు ఇచ్చిన పిలుపులో భాగంగా మండల కేంద్రంలో సోమవారం బంద్‌ సంపూర్ణంగా కొనసాగింది. వాణిజ్య, వ్యాపార సముదాయాలు బంద్‌ను స్వఛ్ఛందంగా పాటించి పూర్తి మద్దతు పలికారు. అవాంఛనీయ సంఘటనలు జర్గకుండా సీఐ వెల్పుల రమేష్‌, ఎస్సై రవికుమార్‌ పర్యవేక్షణలో బందో బస్‌ నిర్వహించారు.

Updated Date - Jul 21 , 2025 | 11:14 PM