Share News

మాజీ ఎమ్మెల్యే మర్రిని కలిసిన సర్పంచ్‌లు

ABN , Publish Date - Dec 13 , 2025 | 11:21 PM

మండలంలోని వివిధ గ్రామాల నుంచి బీఆర్‌ ఎస్‌ పార్టీ నుంచి గెలుపొందిన సర్పంచులు పలువురు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిని శనివారం నేరెళ్లపల్లి గ్రామంలోని ఆయన సొం త నివాసంలో కలిశారు.

మాజీ ఎమ్మెల్యే మర్రిని కలిసిన సర్పంచ్‌లు
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిని కలిసిన ఇంద్రకల్‌ గ్రామ సర్పంచ్‌ బంగారమ్మ, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ సమద్‌పాషా

తాడూరు, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని వివిధ గ్రామాల నుంచి బీఆర్‌ ఎస్‌ పార్టీ నుంచి గెలుపొందిన సర్పంచులు పలువురు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిని శనివారం నేరెళ్లపల్లి గ్రామంలోని ఆయన సొం త నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఇంద్ర కల్‌ గ్రామ సర్పంచ్‌ బంగారమ్మ, సిర్సవాడ గ్రామ సర్పంచ్‌ శ్రీదేవి, ఆకునెల్లికు దురు గ్రామ సర్పంచ్‌ బాలవెంకటయ్యతో పాటు ఆయా గ్రామాల నూతన సర్పంచ్‌లు, వార్డు సభ్యులను మాజీ ఎమ్మెల్యే అభినందించి శాలువాలతో సత్కరించారు. మర్రి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పాల న అందించి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ సమద్‌పాషా, మాజీ సర్పంచ్‌లు రమణ, వివిధ గ్రామాల బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సిర్సవాడ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన వాస శ్రీదేవిని పూలమాలలు, శాలువాలతో గ్రామస్థులు అభినందించారు.

Updated Date - Dec 13 , 2025 | 11:21 PM