అమరుల త్యాగాలు స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి
ABN , Publish Date - Oct 21 , 2025 | 11:02 PM
: విధి నిర్వహ ణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతీ ఒక్క పోలీసు స్ఫూ ర్తిదాయకంగా తీసుకోవాలన రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో బ్లాక్ డే సం దర్భంగా విధి నిర్వహణలో అమరులైన వారికి ఆయన నివాళు లర్పించారు.
విధి నిర్వహణలో 191 మంది మృతి
నివాళులర్పించిన రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాల క్రైం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి) : విధి నిర్వహ ణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతీ ఒక్క పోలీసు స్ఫూ ర్తిదాయకంగా తీసుకోవాలన రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో బ్లాక్ డే సం దర్భంగా విధి నిర్వహణలో అమరులైన వారికి ఆయన నివాళు లర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 191 మంది విధి నిర్వహణలో భా గంగా మృతి చెందారన్నారు. వారి పేర్లను అడిషనల్ డీసీపీ అ డ్మిన్ శ్రీనివాస్ చదివి వినిపించారు. పోలీసు అమరవీరుల కు టుంబ సభ్యులు, ఇతర పోలీసు సిబ్బంది పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలతో నివాలులర్పించారు. సాయుఽధ పో లీసులు శోక్ స్వస్త్ చేసి పోలీసు అధికారులు, సిబ్బంది అమరవీ రుల కుటుంబ సభ్యులు మౌనం పాటించారు. పోలీసులు మహా నుభావులని పోలీసు అమరవీరులు చూపిన మార్గదర్శకాన్ని అ నుసరిస్తూ ప్రజల శ్రేయస్సుకు పాటుపడాలని ,ప్రరజల్లో మంచి పేరు రావాలంటే చిత్తశుద్ధి, నీతి, నిజాయితీతో పని చేయాలన్నా రు. పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివని, వారు ఎళ్లప్పు డు గుండెల్లో నిలిచి ఉంటారన్నారు. పోలీసు అమరవీరుల కు టుంబ సభ్యులకు పోలీసు అండగా ఉంటుందన్నారు. శాఖాప రమైన సమస్యలు ఉంటే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదా వరిఖని ఏసీపీ రమేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏవో శ్రీనివాస్, రామగుండం పోలీసు కమిషన రేట్ పరిధిలోని ఇన్ప్సెక్టర్లు, ఆర్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.