kumaram bheem asifabad- అమరుల త్యాగాలు మరువలేనివి
ABN , Publish Date - Oct 30 , 2025 | 10:10 PM
సమాజ భద్రత కోసం ప్రాణతాగ్యం చేసిన పోలీస్ అమర వీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని ఎస్పీ కాంతిలాల్‌పాటిల్ అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గురువారం హెల్మెట్ బైక్ ర్యాలీని జిల్లా ఎస్పీ కాంతిలాల్‌పాటిల్ ప్రారంభించారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): సమాజ భద్రత కోసం ప్రాణతాగ్యం చేసిన పోలీస్ అమర వీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని ఎస్పీ కాంతిలాల్‌పాటిల్ అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గురువారం హెల్మెట్ బైక్ ర్యాలీని జిల్లా ఎస్పీ కాంతిలాల్‌పాటిల్ ప్రారంభించారు. ఈ ర్యాలీ జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ప్రారంభమై ఆసిఫాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా సాగి తిరిగి జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజ భద్రత కోసం ప్రాణతాగ్యం చేసిన పోలీస్ అమర వీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని చెప్పారు. వారి త్యాగస్పూర్తి ప్రతి పోలీసు సిబ్బందిలో నిబద్దతను, దైర్యాన్ని పెంపొందిస్తుందని అన్నారు. ర్యాలీలో జిల్లా పోలీసు అధికారులు, పోలీసులు సిబ్బంది, యువత, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు, ఆర్‌ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం కాగజ్‌నగర్ పట్టణంలో మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీఎస్పీ వహిదుద్దీన్ ప్రారంభించగా ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. కార్యక్రమంలో సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, క్రీడాకారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిదులు పెద్ద సంఖ్యలో పాల్గొనందుకు డీఎస్పీ అభినందనలు తెలిపారు.
కొవ్వొత్తుల ర్యాలీ
సిర్పూర్(టి), అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం సిర్పూర్(టి) మండల కేంద్రంలో ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు, యువకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ బస్టాండు నుంచి ప్రారంభమై పలు వీధుల గుండా కొనసాగి పోలీసు స్టేషన్‌కు చేరు కుంది. కార్యక్రమంలో ఏఎస్సై రాములు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
జైనూర్, (ఆంధ్రజ్యోతి): జైనూర్ పోలీస్‌స్టేషన్‌లో రిమ్స్ ఆదిలాబాద్ సమన్వయంతో రక్తదానం శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 61 యూనిట్ల రక్తం సేకరించామని సీఐ రమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ రక్తదానం చేయడం గొప్ప మానవతా సేవ అన్నారు. ఒక యూనిట్ రక్తం మరొకరి ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సైలు రవికుమార్, రామకృష్ణ, పోలీస్ సిబ్బంది, టీజీఎస్‌పీ ఫోర్స్ సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.