అమరవీరుల త్యాగాలు మరువలేనివి
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:27 PM
అటవీశాఖ అధికారుల త్యాగాలు మరువలేనివని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.
- ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
- జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంలో ఘన నివాళి
అచ్చంపేట, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : అటవీశాఖ అధికారుల త్యాగాలు మరువలేనివని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. జాతీయ అటవీశాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం అచ్చంపేట అటవీశాఖ డివిజన్ కార్యాలయం నుంచి అంబేడ్కర్ చౌరస్థావరకు అటవీశాఖ అధికారులు నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అటవీశాఖ అమరవీరుల చిత్ర పటాలకు పూలమాలవేసి నివాళ్లు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోని అడవులను, వన్యప్రాణులను రక్షించడంలో అటవీ అధికారుల సేవలు వెలకట్టలేనివన్నారు. కార్యక్రమంలో నాయకులు అంతటి మల్లేష్ మాజీ ఎంపీపీ రామనాథం, ఎఫ్డీఓ రేంజ్ అధికారులతో పాటు సెక్షన్ బీట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
విద్యాభివృద్ధికి పెద్దపీట
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్మే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ముందుగా కళాశాల ప్రిన్సిపాల్, లెక్షరర్లు, విద్యార్థులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.
స్ర్పింక్లర్ పైపుల పంపిణీ
వంగూరు : ప్రభుత్వం రాయితీ పై రైతులకు అందజేస్తున్న స్ర్పింక్ల ర్ పైపు సెట్లు రైతులకు ఎంతో ప్రయోజనాన్ని ఇస్తున్నాయని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. గురువారం మం డల పరిధిలోని డిండిచింతపల్లిలో స్ర్పింక్లర్ పైపుసెట్లు, పలువురు లబ్ధిదారులకు రేషన్ కార్డుల ప్రొ సీడింగ్‌లను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో యూరియాను సరఫరా చేయనందు నే కొరత ఏర్పడిందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల మద్దతు కాం గ్రెస్ పార్టీకే ఉందన్నారు. కార్యక్రమంలో అల్వా ల్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, రమేష్‌గౌడ్, సతీష్‌రెడ్డి, మహేశ్వరి పాల్గొన్నారు.