Share News

kumaram bheem asifabad- అటవీ అమరుల త్యాగాలు చిరస్మరణీయం

ABN , Publish Date - Sep 11 , 2025 | 10:49 PM

అడువుల రక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి ఆశయాలకు అనుగుణంగా సిబ్బంది పని చేయాలని జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్‌ టిబ్రెవాల్‌ అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా గురువారం జిల్లా కార్యాలయంలో అమరవీరుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు

kumaram bheem asifabad-  అటవీ అమరుల త్యాగాలు చిరస్మరణీయం
అమరవీరుల చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న అధికారులు

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): అడువుల రక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి ఆశయాలకు అనుగుణంగా సిబ్బంది పని చేయాలని జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్‌ టిబ్రెవాల్‌ అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా గురువారం జిల్లా కార్యాలయంలో అమరవీరుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ స్మగ్లర్‌ వీరప్పన్‌ చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఐఎఫ్‌ఎస్‌ శ్రీనివాస్‌ స్మరకార్థం ఏటా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు మూడు దశాబ్దాల కాలంలో 30 మంది అటవీ అధికారులు విధి నిర్వహణలో ప్రాణాలు కొల్పోయరని తెలిపారు. అడవుల సంరక్షణ కోసం తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు గొప్పవరి కొనియడారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వో గోవింద్‌ చంద్‌ సర్థార్‌, తెలంగాణ జూనియర్‌ ఫారెస్టు ఆసోసియోషన్‌ జిల్లా అధ్యక్షులు యోగేష్‌, అటవి అధికారులు ఝాన్సీరాణి, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2025 | 10:50 PM