kumaram bheem asifabad- పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి
ABN , Publish Date - Oct 21 , 2025 | 10:37 PM
పోలీసు అమర వీరుల తాగ్యాలు మరువలేనివని, వారి త్యాగాన్ని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని ఏఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు అమర వీరుల సంస్మరణ దినం మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): పోలీసు అమర వీరుల తాగ్యాలు మరువలేనివని, వారి త్యాగాన్ని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని ఏఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు అమర వీరుల సంస్మరణ దినం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్, అమర వీరుల కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎస్పీ పోలీసుల గౌరవందనం స్వీకరించారు. జ్యోతి ప్రజ్వలన చేసి అమర వీరుల కుటుంబ సభ్యులను పలుకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అక్టోబరు 21ని దేశ వ్యాప్తంగా పోలీసు అమర వీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటామని చెప్పారు. ప్రజల భద్రత కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీసు వీరులను ఈ రోజు స్మరించుకోవడం మన గౌరవకర్తవ్యమన్నారు. పోలీసులు ఎండనక, వాననక ప్రజల రక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. వారి సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. అమరులైన అధికారులు, సిబ్బందిని స్మరిం చుకుంటూ వారి కుటుంబాలకు గౌరవం తెలియజేస్తున్నామన్నారు. అనంతరం కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్ దేశ వ్యాప్తంగా వీర మరణం పొందిన పోలీసుల పేర్ల ను చదివి వినిపించారు. అనంతరం పోలీసు అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ పెద్దన్న జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు విజయశంకర్‌రెడ్డి, సీఐ రాణా ప్రతాప్, బాలాజీ వరప్రసాద్, అంజన్న, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.