Share News

kumaram bheem asifabad- వీరుల త్యాగం చిరస్మరణీయం

ABN , Publish Date - Sep 17 , 2025 | 11:13 PM

రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ కోసం పోరాడిన వీరుల త్యాగం చిరస్మరణీయమని, నాటి పోరాటాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైం దని, వీరయోధులను స్మరించుకోవాలని శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండ ప్రకాష్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లో బుధవా రం నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌, అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, దేవిడ్‌, కాగజ్‌నగర్‌ సబ్‌కలెక్టర్‌ శ్రద్ధ శుక్లా, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మిలతో కలిసి ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు.

kumaram bheem asifabad- వీరుల త్యాగం చిరస్మరణీయం
జాతీయ జెండాను ఎగుర వేస్తున్న శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌

- అర్హులకే సంక్షేమ పథకాలు అందేలా ప్రణాళిక

- శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ కోసం పోరాడిన వీరుల త్యాగం చిరస్మరణీయమని, నాటి పోరాటాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైం దని, వీరయోధులను స్మరించుకోవాలని శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండ ప్రకాష్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లో బుధవా రం నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌, అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, దేవిడ్‌, కాగజ్‌నగర్‌ సబ్‌కలెక్టర్‌ శ్రద్ధ శుక్లా, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మిలతో కలిసి ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు. అంతకు ముందు పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. అనం తరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అన్ని వర్గాల ఆభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు పథకాల ఫలాలను అందిస్తున్నామని అన్నారు. మహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. ఈ పథకం ద్వారా అడబిడ్డలకు రూ.6,790 కోట్లు ఆదా అయ్యాయన్నారు. ఇటీవలే 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటిందని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 1.68 కోట్ల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకొని రూ. 47.26 కోట్ల లబ్ధి పొందారన్నారు. జిల్లాలో 73,500 కుటుంబా లకు మహిళలను కుటుంబ యాజమానిగా గుర్తిం చి గ్యాస్‌ రాయితీ సొమ్మును వారి ఖాతాలో జమ చేస్తున్నామని అన్నారు. ఆరోగ్య శ్రీ పరిధిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పెంచామని, జిల్లాలో ఈ పథకం ద్వారా 11997 మంది పేదలు వైద్య చికిత్సలు పొందరన్నారు. జిల్లాకు 7,398 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని అన్నారు. గృహజ్యోతి పథకం కింద జిల్లాలోని అర్హులైన 72,817 కుటుంబాలకు రూ. 31.58 కోట్లు రాయితీ అందించడం జరిగిందన్నారు. జిల్లాలో రైతు రుణమాఫీ కింద 51,523 మంది రైతులకు రూ. 465 కోట్లు అందించామని అన్నారు.. రైతుభరోసా కింద జిల్లాలో 2025 వానకాలంలో 1,33,306 మంది రైతుల ఖాతాల్లో రూ. 251 కోట్లు జమఅయ్యాయని అన్నారు. రైతు భీమా కింద జిల్లాలో 75,890 మంది రైతులు పేరు నమోదు చేసుకొగా ఇప్పటి వరకు 501 మంది రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున రూ. 25 కోట్లు వారి నామినీల ఖాతాలో జమ చేశామని వివరించారు. ఇందిర మహిళా శక్తి పథకం ద్వారా జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 914 స్వయం సహా యక సంఘాలకు రూ.58.11 కోట్ల రుణాలు అందిం చామని అన్నారు. జిల్లాలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో 4356 దరఖాస్తులు రాగా 322 దరఖాస్తులు పరిష్కరించామని అ న్నారు. మిగతా దరఖాస్తులు పరిశీలనలో ఉన్నా యని అన్నారు. ప్రతి నియోజక వర్గంలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ స్కూల్‌లను ప్రభుత్వం నిర్మించనుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ఎఫ్‌డీవో సుశాంత్‌, జిల్లాలోని ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ జాతీయ జెండాలను ఎగుర వేశారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్‌ టిబ్రెవాల్‌, పీఆర్‌ ఈఈ కృష్ణ, నీటిపారుదల శాఖఈఈ గుణవంత్‌రావు, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ ఆలీబీన్‌ ఆహ్మద్‌, మండల ప్రత్యేకాధికారి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొని జెండా ఎగురవేశారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ప్రజా పాలన వేడుకలను బుధవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంస్థల్లో జెండాలు ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్‌ కవిత, ఎంపీడీవో ఖాజా అజీజోద్దీన్‌, ఏవో గోపికాంత్‌, వైద్యాధికారి వినయ్‌, ఐకేపీ ఏపీఎం కోనయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ జాబిరే పెంటు, ఐసీడీఎస్‌ ఏసీడీపీంఎ ఉమాఫాతిమ, ప్రభుత్వ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ చంద్రయ్య, ఎస్టీవో హబీబ్‌, కేజీబీవీ పాఠశాల ఇన్‌చార్జి ఎస్‌వో మీన, బీఆర్‌ఎస్‌ మాజీ జడ్పీటీసీ అజయ్‌కుమార్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గుర్నులే నారాయణ పాల్గొన్నారు.

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): మండలంలో బుధవారం ప్రజ పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడ్మేత విశ్వనాథ్‌రావు, సహకార సంఘం చైర్మన్‌ కోడప్పా హన్ను పటేల్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ కనక యదవ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి) మండల కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్‌ సంతోష్‌కుమార్‌, ప్రత్యేకాధికారి వెంకట్‌, అటవీ రేంజ్‌ అధికారి మజారోద్దిన్‌ తదితరులు పాల్గొన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండలంలో బుధవారం అన్ని ప్రభుత్వ, ప్రైవే టు కార్యాలయాలు, పాఠశాలల్లో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్‌ రామ్మోహన్‌, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై సర్తాజ్‌పాషా, ఏవో నాగరాజు, ఎంఈవో సునీత, అటవీ రేంజ్‌ అధికారి ముసావీర్‌ తదితరులు పాల్గొన్నారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి) మండల వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్‌ దామెర వెంకటేశ్వర్‌రావు, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, ఎస్సై ఇస్లావత్‌ నరేష్‌, మాజీ ఎంపీపీ డుబ్బుల నానయ్య, నాయకులు ఎల్ములె మల్లయ్య, టొంబ్రె శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(టి), (ఆంధ్రజ్యోతి): మండలంలో ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిం చారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్‌ రహిమోద్దీన్‌, ఎంపీడీవో సత్యనారాయణ, ఎస్సై సీహెచ్‌ సురేష్‌, ఈవో తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): మండలంలో ప్రజాపాలన దినోత్సవాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్‌ సూర్యప్రకాష్‌, ఎంపీడీవో శంకరమ్మ, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 11:13 PM