Share News

kumaram bheem asifabad- కొలువుదీరనున్న పాలకవర్గాలు

ABN , Publish Date - Dec 21 , 2025 | 09:48 PM

జిల్లా వ్యాప్తంగా మూడో దశల్లో నిర్వహించిన ఎన్నికలు ముగియడంతో ఇక పాలన ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు డిసెంబరు 22న పంచాయతీల కొత్త పాలక వర్గాలు అధికారికంగా కొలువుదీరనున్నాయి. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలు జరుగగా 335 పంచాయతీలకు గాను 332 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి విజేతలను ప్రకటించారు.మిగతా మూడు గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు నామినేషన్లు రిజర్వేషన్లు అనుకులించక దాఖలు కాకపోవడంతో అక్కడ ఉపసర్పంచ్‌లే సర్పంచ్‌లుగా బాధ్యతలను చేపట్టనున్నారు.

kumaram bheem asifabad- కొలువుదీరనున్న పాలకవర్గాలు
గోవింద్‌పూర్‌ పంచాయతీ కార్యాలయం

- ఏర్పాట్లు పూర్తి చేసిన పంచాయతీ అధికారులు

ఆసిఫాబాద్‌రూరల్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా మూడో దశల్లో నిర్వహించిన ఎన్నికలు ముగియడంతో ఇక పాలన ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు డిసెంబరు 22న పంచాయతీల కొత్త పాలక వర్గాలు అధికారికంగా కొలువుదీరనున్నాయి. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలు జరుగగా 335 పంచాయతీలకు గాను 332 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి విజేతలను ప్రకటించారు.మిగతా మూడు గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు నామినేషన్లు రిజర్వేషన్లు అనుకులించక దాఖలు కాకపోవడంతో అక్కడ ఉపసర్పంచ్‌లే సర్పంచ్‌లుగా బాధ్యతలను చేపట్టనున్నారు. అలాగే 2874 వార్డు స్థానాలకు సంబంధించి కూడా విజేతలను ప్రకటించారు. దాంతో కొత్త పంచాయతీ రాజ్‌ చట్టానికి అనుగుణంగా గ్రామాల్లో సర్పంచ్‌ల పాలన సోమవారం నుంచి అమలులోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో పంచాయతీలకు సంబంధించి అధికార యంత్రాంగం ఇప్పటికే సర్పంచ్‌లు కొలువుదీరేందుకు అవసరమైన అన్ని చర్యలను యుద్దప్రాతిపదికపై చేపడుతోంది. గత రెండేళ్ల కాలం నుంచి ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలోనే కొత్త పాలక వర్గాలు కొలువు దీరబోతున్నాయి.

15 మండలాల పరిధిలో..

కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని 15 మండలాల్లోని 335 గ్రామపంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహించారు. మొదటి విడతలో జైనూరు, కెరమెరి, సిర్పూర్‌(యూ), లింగాపూర్‌, వాంకిడి మండలాల్లో 114 గ్రామ పంచాయితీలకు, 944 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండో విడతలో బెజ్జూరు, చింతలమానేపల్లి, దహెగాం, కౌటాల, పెంచికల్‌పేట, సిర్పూర్‌(టి) మండలాల్లోని 113 సర్పంచ్‌ స్థానాలకు, 992 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మూడో విడతలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, రెబ్బెన, తిర్యాణి మండలాల్లోని 108 సర్పంచ్‌ స్థానాలకు, 938 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కొత్తగా ఎన్నికైన 335 మంది సర్పంచ్‌లతో పాటు ఉప సర్పంచ్‌, వార్డు సభ్యుల ప్రమాణస్వీకారం సోమవారం మండలంలోని అయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నిర్వహించనున్నారు. ఇందుకు గాను ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సర్పంచ్‌ల ప్రమాణస్వీకారం, నియమక పత్రాల అందజేత, నిధులు, విధులు వంటి అంశాలపై ప్రాథమికంగా శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం అయా మండలాల్లోని గ్రామపంచా యతీ కార్యాలయాల వద్ద నిర్వహించే ప్రమాణస్వీకారోత్సవానికి అదికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. గ్రామపంచాయతీల కార్యాలయాలను ముస్తాబు చేశారు.

Updated Date - Dec 21 , 2025 | 09:48 PM