పరిశ్రమల మనుగడను దెబ్బతీస్తున్న పాలకవర్గాలు
ABN , Publish Date - Mar 16 , 2025 | 10:36 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు పరిశ్రమల మనుగడను దెబ్బతీస్తున్నాయని ప్రైవేటు పెట్టుబడిదారులకే పెద్దపీట వేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను లేకుండా చేస్తున్నాయని ఐఎఫ్‌టీయు జాతీ య ప్రధాన కార్యదర్శి పి. శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఐఎఫ్‌టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్
మందమర్రిటౌన్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు పరిశ్రమల మనుగడను దెబ్బతీస్తున్నాయని ప్రైవేటు పెట్టుబడిదారులకే పెద్దపీట వేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను లేకుండా చేస్తున్నాయని ఐఎఫ్‌టీయు జాతీ య ప్రధాన కార్యదర్శి పి. శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం గోదావరిఖనిలో నిర్వహించిన జీఎల్‌బీకేఎస్, టీజీఎల్‌బీకెఎస్ విలీన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరోక్షంగా, ప్రత్యక్షంగా లక్ష లాది మందికి అన్నం పెడుతున్న సింగరేణి సంస్థను దెబ్బతీసే చర్యలకు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు సహకరిస్తున్నాయని, ఇంతకంటే మరోటి ఉండదని తెలిపారు. సింగరేణి సంస్థపరిరక్షణ, నూతన గనుల ఏర్పాటుకు, ఉద్యోగ భద్రత సాధించుటకు త్వరలోనే చేపట్టే పోరాటాలకు బొగ్గు గని కార్మికులు ముందుండాలన్నారు. సింగరేణిలో నూతన గనులు ఏర్పాటు చేయకపోతే ఉపాధి అవకాశాలు కనుమరుగవుతాయన్నారు. సత్తుప ల్లి, కోయగూడెం, శ్రావణపల్లి, కెకె6 గనుల అమ్మకాలకు వ్యతిరేకంగా మూడు రోజుల సమ్మెతోపాటు అనేక ఆందోళనలు కార్మిక సంఘాలు అన్ని ఐక్యంగా నిర్వహించినప్ప టికీ నాటి ఉద్యమంలో పాల్గొన్న ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీలు సింగరేణి గుర్తింపు సంఘంఎన్నికల తరువాత స్వరం మార్చాయన్నారు. సింగరేణి సంస్థ కూడ టెండర్‌లో పాల్గొనాలని చెప్పడం ఏమిటని వారు మండిపడ్డారు. సింగరేణిలోని గనులు సింగరేణికి కేటాయించాలని తమ డిమాండ్ అన్నారు. సింగరేణి పరిరక్షణతో పాటు నూతన గనుల ఏర్పాటు, ఉద్యోగ భద్రత కోసం ప్రాతినిధ్య సంఘాలన్ని కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం కలిసి వచ్చే సం ఘాలతో పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర నాయకులు, నరేశ్, అశోక్, రామకృష్ణా, ఎండీ జాఫర్, నాగేశ్వర్‌రావు, కృష్ణ, మల్లేశం, ప్రసాద్, తాళ్లపల్లి శ్రీనివాస్, చిలుక శంకర్, రాయమల్లు, శేఖర్, పెరిక మొం డయ్య, ప్రసాద్, కొమురయ్య పాల్గొన్నారు.