Share News

సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం

ABN , Publish Date - Mar 12 , 2025 | 11:16 PM

స మాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని జిల్లా రెవె న్యూ అదనపు కలెక్టర్‌ అమ రేందర్‌ అన్నారు.

సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
మహిళలకు బహుమతులు అందజేస్తున్న అదనపు కలెక్టర్‌ అమరేందర్‌

- అదనపు కలెక్టర్‌ అమరేందర్‌ - కలెక్టరేట్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, మా ర్చి 12 (ఆంధ్రజ్యోతి) : స మాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని జిల్లా రెవె న్యూ అదనపు కలెక్టర్‌ అమ రేందర్‌ అన్నారు. అంతర్జాతీ య మహిళా దినం వారో త్సవాల్లో భాగంగా బుధవా రం కలెక్టరేట్‌ ఆడిటోరియం లో ముగింపు వేడుకల ఘ నంగా నిర్వహించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ ఆ ధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ అమరేందర్‌ హాజరై విజేతలకు బహుమ తులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధికి మహిళలు కీలకమన్నారు. ప్రతీ కు టుంబంలో మహిళను విద్యావంతురాలిని చేస్తే ఆ కుటుంబం, సమాజం అభివృద్ధి సాధించిన ట్లేనన్నారు. కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలె క్టర్‌ అరుణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధి కారి రాజేశ్వరి, జిల్లా వైద్యాధి కారి స్వరాజ్యలక్ష్మీ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వ యకర్త శ్వేత, సఖీ సెంటర్‌ అడ్మిన్‌ సునీత, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 11:16 PM