సమాజంలో వైద్యుల పాత్ర కీలకం
ABN , Publish Date - Jul 23 , 2025 | 11:47 PM
సమా జంలో వైద్య రంగంలో పని చేస్తున్న వైద్యుల పాత్ర ఎంతో కీలకమని ప్రభుత్వ సాధారణ ఆ సుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్. రఘు అన్నారు.
- వైద్యులకు శాలువాలతో ఘన సన్మానం
- జిల్లాలో జాతీయ వైద్యుల దినోత్సవం
కందనూలు, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : సమా జంలో వైద్య రంగంలో పని చేస్తున్న వైద్యుల పాత్ర ఎంతో కీలకమని ప్రభుత్వ సాధారణ ఆ సుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్. రఘు అన్నారు. భారతదేశంలో డాక్టర్ బిధాన్ చంద్రారాయ్ ఆరోగ్య రంగానికి ఆయన సేవలకు నివాళులర్పించేందుకు జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని 1991 సంవత్స రంలో మొ దటిసారిగా జరుపుకున్నారని ఆయన అన్నారు. మంగళవారం లయన్స్‌క్లబ్ ఆఫ్ నాగ ర్‌కర్నూల్, క్లాస్‌మెట్ క్లబ్ వారి ఆధ్వర్యంలో వై ద్యులను శాలువా, పూల మాలలతో ఘనంగా సన్మానిం చారు. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న ప్రొఫెసర్లు, అసి స్టెంట్ ప్రొఫెసర్లు, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్స్, ఇతర వైద్యులను శాలువాలతో ఘనంగా సన్మా నించారు. వైద్యులు, ఇతరులు పాల్గొన్నారు.
ఫ అచ్చంపేటటౌన్ : జాతీయ వైద్యుల దినో త్సవం సందర్బంగా మంగళవారం పట్టణంలో ని బాలసదన్‌లో చిన్నపిల్లలకు భవాని హాస్పిట ల్స్ సిబ్బంది ఉచిత క్యాంపు నిర్వహించారు. చి న్నపిల్లల వైద్యులు డాక్టర్ ప్రశాంత్ హెల్త్ క్యాం పు నిర్వహించి పిల్లలకు వైద్యపరీక్షలు చేశారు.
ఫ తిమ్మాజిపేట : జాతీయ డాక్టర్స్ దినోత్స వం సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు ఇస్మాయిల్, చేగుంట పల్లె దవాఖాన వైద్యురాలు సరితలను శాలువాలు కప్పి ఘ నంగా సన్మానించారు.
ఫ వెల్దండ : జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని స్థానిక వైద్యాధికారి సింధును టీఆర్‌ఎస్‌వీ, బీఆర్‌ఎస్ నాయకులు యాదగిరి, ప్రసాద్, రాజు, చంద్రశేఖర్, గణేష్ ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించారు.
ఫ కల్వకుర్తి : కల్వకుర్తిలోని వాసవీక్లబ్ భవన్‌లో వాసవీక్లబ్ కల్వకుర్తి అధ్యక్షుడు బాదం రాఘవేందర్ ఆధ్వర్యంలో వైద్యులను శాలువాల తో సత్కరించి మెమెంటోలను బహూకరించారు. క్లబ్ కార్యదర్శి రవికుమార్, వాసవిక్లబ్ జిల్లా నాయకులు చిగుళ్లపల్లి శ్రీధర్ పాల్గొన్నారు.
ఫ కొల్లాపూర్ : వైద్యుల దినోత్సవం పురస్క రించుకొని కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆధ్వ ర్యంలో సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. రోగులకు వైద్యం అందించాలని సూచించారు.