Share News

రోడ్లు ఇలా..రాకపోకలు ఎలా!

ABN , Publish Date - Aug 10 , 2025 | 12:58 AM

జిల్లా కేంద్రంలో ని 35 వార్డులో అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. కాలనీలో మట్టి రోడ్లు గుంతలమయంగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

 రోడ్లు ఇలా..రాకపోకలు ఎలా!
గుంతలమయంగా మారిన రోడ్లు

రోడ్లు ఇలా..రాకపోకలు ఎలా!

వర్షం పడితే మరింత దారుణం

సీసీ రోడ్ల నిర్మాణంలో జాప్యం

ఇదీ నల్లగొండ మునిసిపాలిటీలోని 35వ వార్డు పరిస్థితి

నల్లగొండ, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో ని 35 వార్డులో అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. కాలనీలో మట్టి రోడ్లు గుంతలమయంగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్డును ఆనుకుని ఉన్న ఈ వార్డులో పద్మానగర్‌, హనుమాననగర్‌, న్యూ రాఘవేంద్రకాలనీ, ఎనజీబీ కాలనీ, శివరాంనగర్‌, పద్మశాలీనగర్‌లో చాలా వరకు మట్టి రోడ్లు ఉన్నాయి. కొద్ది రోజులుగా అండర్‌ డ్రైనేజీ రోడ్లు వేస్తున్నారు. దీంతో ఉన్న రోడ్లను తవ్వడం వల్ల గుంతలమయంగా మారి నడవడానికి కూడా వీలు లేకుండాపోయింది. ద్విచక్ర వాహనాలు, కార్లు వెళ్లాలంటే సమస్యగా మారింది. ఇక వర్షాలు కురిసినప్పుడు ప్రజలు రోడ్ల మీద నడవాలంటే నరకయాతన ఎదుర్కొంటున్న పరిస్థితి ఏర్పడింది. పలుమార్లు ఉన్నతాధికారులు, మునిసిపల్‌ అధికారులకు వినతిపత్రాలు కూడా సమర్పించారు. అయిన వార్డులో మట్టిరోడ్ల పరిస్థితి మారడం లేదు. సీసీ రోడ్ల నిర్మాణం లేకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

డ్రైనేజీ పనుల కోసం తవ్వకాలు

డ్రైనేజీ పనుల కోసం తవ్వకాల కోసం వార్డులోని పలు ప్రాంతాల్లో పాత సీసీ రోడ్లను కూడా తవ్వారు. హనుమాన నగర్‌లోని పలు వీధుల్లో రోడ్లను తవ్వి డ్రైనేజీ లింకులను కలిపారు. అయితే రోడ్లు తవ్విన ప్రాంతంలో ఎక్కడికక్కడ మట్టి కు ప్పలు ఉండటంతో నడవడం కూడా సమస్యగా మారుతుంది. హనుమాననగర్‌లోని వెంకటసాయి ఫంక్షన హాల్‌ నుంచి మొదలుకొని రైలు అండర్‌ పాస్‌ బ్రిడ్జి వరకు రోడ్డు అధ్వానంగా మారిపోయింది. ఈ రోడ్డు మార్గం కూడా బతుకమ్మ చెరువు కుంట నుంచి టౌనలోకి అధిక సంఖ్యలో వచ్చి పోతుంటారు. అయితే చెరువు కట్టపై కూడా రోడ్డు దారుణంగా ఉండగా ఆ కట్టపై నుంచి అండర్‌ పాస్‌ బ్రిడ్జి దాటిన తర్వాత మొత్తం 35వ వార్డులోని రోడ్లన్నీ దెబ్బతినడంతో ప్రజలకు సమస్య ఎదురువుతుంది.

ప్రస్తుతం మునిసిపల్‌ పాలకవర్గం లేకపోవడంతో అధికారులు సైతం స్థానికుల మాటలు కూడా పెడచెవిన పెడుతున్నట్లు తెలుస్తుంది. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎక్కడ వేసిన గొంగడి అన్న చందంగా పరిస్థితి తయారైంది. వెంటనే వార్డులో రోడ్డు సమస్యను పరిష్కరించాలని కాలనీలవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

మట్టిరోడ్లతో ప్రజలకు ఇబ్బందులు

మట్టి రోడ్ల స్థానంలో సీసీ రోడ్లను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవ డం లేదు. మునిసిపల్‌ పాలకవర్గం ఉన్న సమయం లో కౌన్సిల్‌లో అనేక సార్లు వినతిపత్రాలు సమర్పిం చాం. అయినా అధికారులు పట్టించుకోలేదు. వర్షాలు వచ్చినప్పుడు మట్టి రోడ్లల్లో ప్రజలు ఇబ్బందులు ఎ దుర్కొంటున్నారు. అధికార యంత్రాంగం వెంటనే స్పందించి ప్రజల బాధలను అర్థం చేసుకొని సమస్యలను పరిష్కరించాలి. కాలనీలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడటం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. వర్షం పడినప్పుడు ఎక్కడి నీళ్లు అక్కడే ఉండి సమస్యగా మారుతుంది. దీంతో అధికారులు స్పం దించి చర్యలు తీసుకోవాలి.

- గుర్రం ధనలక్ష్మి, మాజీ కౌన్సిలర్‌, 35వ వార్డు

Updated Date - Aug 10 , 2025 | 12:58 AM