kumaram bheem asifabad- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి
ABN , Publish Date - Dec 19 , 2025 | 10:12 PM
జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు ఉపకార వేతనం కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి ఎంఈవో, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో స్కాలర్ షిప్ పోర్టల్‌లో విద్యార్థుల వివరాల నమోదుపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు ఉపకార వేతనం కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి ఎంఈవో, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో స్కాలర్ షిప్ పోర్టల్‌లో విద్యార్థుల వివరాల నమోదుపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2,674 మంది షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు ప్రభుత్వ ఉపకార వేతనాలు అందిస్తుందని అన్నారు. వారి వివరాలను ఈ నెల 23 లేగా స్కాలర్ షిప పోర్టలో నమోదు చేయాలని తెలిపారు. బాలికలకు రూ.1500, బాలురకు రూ.1000 అందిస్తున్నదని అన్నారు. వసతి గృహాలలో ఉంటూ చదువుకునే విద్యార్థులకు ఈ పథకం వర్తించదని, ఇంటి వద్ద నుంచి పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. పదో తరగతి వార్షిక పరీక్షల కోసం విద్యార్థులను ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలని చెప్పారు. ప్రత్యేక తరగతులు నిర్వహించి వంద శాతం విద్యార్థులు హాజరయ్యేలా ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించిన సర్పంచ్, వార్డు సాథనాల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో స్టేజ్-1, 2 ఆర్‌ఓలు, పోలింగ్ అధికారులుగా విధులు నిర్వహించిన ఉపాద్యాయులను అభినందించారు. సమావేశంలో ఇన్‌చార్జి ఎస్సీ సంక్షేమాధికారి అశోక్, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.