రగులుతున్న పోడు వివాదం
ABN , Publish Date - Jun 28 , 2025 | 11:27 PM
పోడు వ్యవసాయం కోసం ఆదివాసీ గిరిజనుల పోరాటం ఆగడం లేదు. మండంలోని కొత్త మామిడిపల్లి పంచాయతీ పరిధిలోని దమ్మనపేట, మామిడిగూడ గ్రామాలకు చెందిన ఆదివాసి గిరిజనులు లింగాపూర్ అటవీ బీట్ లోని 380 కంపార్ట్‌మెంట్‌లో శనివారం పలు చోట్ల పోడు వ్యవ సాయ భూముల కోసం వచ్చిన గిరిజనులను అటవీ పోలీసు శా ఖ అధికారులు, సిబ్బంది అడ్డుకున్నారు.
దండేపల్లి, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): పోడు వ్యవసాయం కోసం ఆదివాసీ గిరిజనుల పోరాటం ఆగడం లేదు. మండంలోని కొత్త మామిడిపల్లి పంచాయతీ పరిధిలోని దమ్మనపేట, మామిడిగూడ గ్రామాలకు చెందిన ఆదివాసి గిరిజనులు లింగాపూర్ అటవీ బీట్ లోని 380 కంపార్ట్‌మెంట్‌లో శనివారం పలు చోట్ల పోడు వ్యవ సాయ భూముల కోసం వచ్చిన గిరిజనులను అటవీ పోలీసు శా ఖ అధికారులు, సిబ్బంది అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న జ న్నారం అటవీ డిజనల్ అధికారి ఎఫ్‌డీవో రామ్మోహన్, తహసీ ల్ధార్ రోహిత్ దేశ్‌పాండే, తాళ్లపేట ఎఫ్‌ఆర్‌వో సుష్మరావు, లక్షెట్టి పేట సీఐ రమణమూర్తి, దండేపల్లి, జన్నారం ఎస్సైలు త హసీనొ ద్దీన్, అనూష, అటవీ శాఖ సిబ్బంది, బేస్ క్యాంపుతో అక్కడికి చే రుకున్నారు. అనంతరం అటవీ గ్రామ సమీపంలో ఉండే గిరిజను లు అటవీ చట్టాలపై పోలీసులు అవగా హన కల్పించారు. అటవీ భూముల్లో చెట్లను తొలగించడం, నరికి వేడయం చట్ట విరుద్దమ ని గిరిజనులకు సూచించారు. గిరిజనులకు ఎంత చెప్పిన విన కుండా వారి పని వారు చేసుకోవడంతో ఎమి చేయలేక అధికారు లు అక్కడే వేచి చూసారు.
ఫ ఎఫ్‌డీవో కాళ్ల మీద పడిన గిరిజనులు
అడవి ప్రాంతాన్ని నమ్ముకుని జీవిస్తున్న తమకు కనీసం బతు కుదెరువు కోసం పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవి స్తామంటే అటవీ శాఖ అధికారులు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుని జీ విస్తున్నామన్నారు. ఈ భూమిపై తమకే హక్కు పత్రాలు అందజేయాలన్నారు. న్యాయం చేయాలంటూ శనివారం ఇక్కడికి వచ్చిన అధికారుల కాళ్లమీద ప డి వేడుకున్నారు. అధికారులు వారికి నచ్చజెప్పినా వినకుండా గిరి జనులు వెళ్లిపోయారు. దీంతో ఉదయం నుంచి అక్కడ అధికారు లు, గిరిజనుల మధ్య పోడు వివాదం కొనసాగుతూనే ఉంది.
రిజర్వ్ ఫారెస్ట్‌లో చెట్లను నరికి వేడయం, తొలగించం చట్ట వి రుద్దమని, అటవీ వ్యనప్రాణి చట్టాలను ఎవరు అతిక్రమిస్తే నే రమని జన్నారం ఎఫ్‌డీవో రామ్మోహన్ సూచించారు. పోడు భూము ల సమస్యలు తమ దృష్టికి తీసుకవస్తే జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.